రాహుల్.. ఓ అక్కినేని మల్టిస్టారర్?
on Nov 23, 2020

'అందాల రాక్షసి'తో తెలుగు తెరకు కథానాయకుడిగా పరిచయమయ్యాడు రాహుల్ రవీంద్రన్. ఆపై పలు చిత్రాల్లో తనదైన నటనతో అలరించాడు. కట్ చేస్తే.. 'చి.ల.సౌ' (ఇందులో సుశాంత్ కథానాయకుడు) చిత్రం కోసం మెగాఫోన్ పట్టి ఆశ్చర్యపరిచాడు. ఫలితంతో పరిశ్రమ దృష్టిని ఆకర్షించాడు. కింగ్ నాగార్జున కూడా ఫిదా అయ్యారు. అలా.. రాహుల్ దర్శకత్వంలో నాగ్ హీరోగా 'మన్మథుడు 2' వచ్చింది. సినిమా డిజాస్టర్ అయినా.. రాహుల్ కి మరో ఛాన్స్ ఇచ్చారట నాగ్. ఈ సారి ఏకంగా ఓ మల్టిస్టారర్ ప్రాజెక్ట్ రాహుల్ చేయబోతున్నాడట.
ఆ వివరాల్లోకి వెళితే.. లాక్ డౌన్ టైమ్ లో నాగార్జున, నాగచైతన్య, అఖిల్ ని దృష్టిలో పెట్టుకుని ఓ కథ తయారుచేసుకున్నాడట రాహుల్. ఇటీవల నాగ్ ని సంప్రదించి అది వినిపించగా గ్రీన్ సిగ్నల్ వచ్చిందని టాక్. త్వరలోనే ఈ క్రేజీ వెంచర్ పై క్లారిటీ వచ్చే అవకాశముందంటున్నారు. ఈ మల్టిస్టారర్ వర్కవుట్ అయితే అక్కినేని కాంపౌండ్ లో రాహుల్ కి వరుసగా ఇది మూడో చిత్రమవుతుంది. చూద్దాం.. ఏం జరుగుతుందో?
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



