హాట్ లేడీకి ఆ అవకాశం వచ్చింది!!
on Dec 5, 2015
.jpg)
రజినీ నటిస్తున్న కబాలి మూవీలో హీరోయిన్ గా రాధికా ఆప్టేను ఎంచుకున్న విషయం తెలిసిందే. కొన్ని నెలలుగా షూటింగ్ జరుగుతున్నా.. రజినీకాంత్ తో కలిసి నటించే అవకాశం రాధికకి ఇప్పుడే వచ్చింది. "ఈ సినిమాలో నా పాత్ర షూటింగ్ కోసం ఎంతో ఎదురు చూశాను మొత్తానికి గోవా చేరుకన్నాను. ఇవాళే షూటింగ్ స్టార్ట్ కానుంది. చాలా థ్రిల్లింగ్ గా ఉంది" అంటూ రాధికా ఆప్టే ట్వీట్ చేసింది. గోవాలో కబాలి యూనిట్ 15 రోజుల పాటు షూటింగ్ నిర్వహించనుంది. రజినీకాంత్ డాన్ గా నటించనుండగా.. ఆ డాన్ కి భార్య పాత్రలో రాధిక యాక్ట్ చేయనుంది. రంజిత్ దర్శకత్వం వహిస్తున్న కబాలి.. వచ్చే ఏడాది సమ్మర్ నాటికి రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయి. కాగా.. డిసెంబర్ 12న సూపర్ స్టార్ పుట్టిన రోజు కావడంతో.. ఆరోజున కబాలి టీజర్ రిలీజ్ కానుండడం విశేషం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



