`రాధే శ్యామ్` ట్రైలర్ వచ్చేది అప్పుడేనా!
on Dec 8, 2021
`రాధే శ్యామ్`.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్. `జిల్` ఫేమ్ రాధాకృష్ణ రూపొందించిన ఈ పిరియడ్ లవ్ సాగాలో నెవర్ సీన్ బిఫోర్ రోల్ లో కనిపించబోతున్నారు ప్రభాస్. పాటలు, ప్రచార చిత్రాలతో ఆసక్తి రేకెత్తిస్తున్న ఈ బిగ్ టికెట్ ఫిల్మ్.. సంక్రాంతి కానుకగా జనవరి 14న పాన్ - ఇండియా మూవీగా పలు భాషల్లో సందడి చేయనుంది.
ఇదిలా ఉంటే.. `రాధే శ్యామ్`కి సంబంధించిన ట్రైలర్ ని డిసెంబర్ 17న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. కుదరని పక్షంలో డిసెంబర్ 21కి రిలీజ్ చేసేలా సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. మరి.. ఈ ప్రచారంలో వాస్తవమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
కాగా, `రాధే శ్యామ్`లో ప్రభాస్ కి జోడీగా `బుట్టబొమ్మ` పూజా హెగ్డే నాయికగా నటించింది. రెబల్ స్టార్ కృష్ణంరాజు, జయరామ్, భాగ్యశ్రీ, జగపతి బాబు, సచిన్ ఖేద్కర్, మురళీ శర్మ, కునాల్ రాయ్ కపూర్, ప్రియదర్శి, సత్యన్, ఫ్లోరా జకోబ్, సాషా చెట్రి ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమివ్వనున్నారు. యూవీ క్రియేషన్స్, టి - సిరీస్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రానికి మనోజ్ పరమహంస ఛాయాగ్రహణం అందించారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
