మళ్లీ కెమెరా ముందుకు చిరు చిన్నల్లుడు
on Dec 12, 2019

చిరంజీవి చిన్నల్లుడు, శ్రీజ భర్త కళ్యాణ్ దేవ్ మొదటి సినిమాకు ఎటువంటి అడ్డంకులు ఎదురు కాలేదు. సాఫీగా షూటింగ్ జరిగింది. హ్యాపీగా విడుదలైంది. కానీ, రెండో సినిమాకు కళ్యాణ్ దేవ్ ఇబ్బందులు తప్పడం లేదు. ఎప్పుడో జనవరిలో సినిమా అనౌన్స్ చేశాడు. ఇప్పటివరకు షూటింగ్ పూర్తి కాలేదు. మధ్యలో కొన్ని సమస్యలతో సినిమాకు బ్రేక్ పడింది. ఇప్పుడు మళ్లీ మొదలైంది. కెమెరా ముందుకు కళ్యాణ్ దేవ్ వచ్చాడు.
కల్యాణ్ దేవ్ హీరోగా పులి వాసు దర్శకత్వంలో రిజ్వాన్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రిజ్వాన్ నిర్మిస్తున్న సినిమా 'సూపర్‌మచ్చి'. ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. కళ్యాణ్ దేవ్ సరసన కన్నడ బ్యూటీ రచితా రామ్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇంతకు ముందు రియా చక్రవర్తి హీరోయిన్‌గా, కళ్యాణ్ దేవ్ హీరోగా ఒక సినిమా షూటింగ్ జరిగింది. విశాఖలో కొన్ని సీన్స్ తీశారు. అదే సినిమాలో ఇప్పుడు హీరోయిన్ మారింది. అదీ సంగతి. ఈ సినిమాకు సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్. తమన్ పని చేస్తున్నాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



