రామ్ చరణ్ "రచ్చ" ఓవర్ సీస్ 2.75 cr
on Jan 5, 2012
రామ్ చరణ్ "రచ్చ" ఓవర్ సీస్ 2.75 cr అని విశ్వసనీయవర్గాలద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే మెగాసూపర్ గుడ్ ఫిలింస్ పతాకంపై, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ హీరోగా, అందాల కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా, "ఏమైందీ వేళ" ఫేం సంపత్ నంది దర్శకత్వంలో నిర్మించబడుతున్న విభిన్నప్రేమకథా చిత్రం"రచ్చ". ఈ "రచ్చ" పేరు వింటేనే కథ ఎలా ఉండబోతుందో మనకు అర్థమవుతుంది. మణిశర్మ ఈ "రచ్చ" చిత్రానికి సంగీతాన్నందిస్తున్నారు.
ఈ "రచ్చ" సినిమా షూటింగ్ శ్రీలంకలో, చైనా దేశాల్లో జరిపారు. ఈ "రచ్చ" చిత్రం ఓవర్ సీస్ రైట్స్ 2.75 cr (రెండుకోట్ల డభై అయిదు లక్షలు) కు అమ్ముడుపోయినట్లు తెలిసింది. రామ్ చరణ్ సినిమాలన్నింటిలోకి ఓవర్ సీస్ కి అత్యధిక మొత్తంలో అమ్ముడుపోయిన సినిమా ఇదే కావటం గమనార్హం. ఈ "రచ్చ" సినిమాని తెలుగులోనే కాకుండా, తమిళ, మళయాళ భషల్లో కూడా విడుదల చేయటానికి ఈ చిత్రం యూనిట్ సన్నాహాలు చేస్తూంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
