ప్రముఖ హీరోయిన్ కి గాయాలు..మెచ్చుకుంటున్న నెటిజన్స్
on May 20, 2025

ఊహలు గుసగుసలాడే మూవీతో సినీ రంగ ప్రవేశం చేసిన రాశిఖన్నా(Raashii Khanna)తొలిప్రేమ, సుప్రీం, జై లవకుశ, బెంగాల్ టైగర్, హైపర్, వెంకిమామ, శ్రీనివాస కళ్యాణం, ప్రతిరోజు పండగే, థాంక్యూ, పక్కా కమర్షియల్ ఇలా పలు చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొంది. గత ఏడాది నవంబర్ లో హిందీలో'సబర్మతి రిపోర్ట్' తో తన నటనలో ఉన్న కొత్త కోణాన్ని తెలియచేసింది.
రీసెంట్ గా రాశిఖన్నా ఇనిస్టాగ్రమ్(Inistagram)వేదికగా తన చేతి వేళ్ళకి రక్తపు మరకలు అంటుకున్న పిక్ తో పాటు చెంపలపై గాయాలైన పిక్స్ ని షేర్ చేస్తు చేస్తు 'కథ డిమాండ్ చేస్తే గాయాలని కూడా లెక్క చెయ్యకూడదు. మనమే ఒక తుఫాన్ అయినప్పుడు ఏ పిడుగు ఆపలేదు అనే క్యాప్షన్ ని ఉంచింది. దీంతో నెటిజన్స్ రాశి ఖన్నా కి యాక్టింగ్ పట్ల ఉన్న కమిట్ మెంట్ ని మెచ్చుకుంటు కామెంట్స్ చేస్తున్నారు.
రాశిఖన్నా ప్రస్తుతం హిందీలో'ఫర్జి 2'(farzi 2)అనే వెబ్ సిరీస్ లో చేస్తుంది. అందులోనే ఆమె గాయాల బారిన పడినట్టుగా వార్తలు వస్తున్నాయి. 2022 లో నాగ చైతన్య తో కలిసి'థాంక్యూ'అనే మూవీలో మెరిసిన రాశిఖన్నా ఆ తర్వాత ఎలాంటి సినిమాలోను కనిపించలేదు. గత ఏడాది సిద్దు జొన్నల గడ్డ తో కలిసి 'తెలుసు కదా' అనే మూవీ అనౌన్స్ చేసింది. కొంతకాలం నుంచి ఈ మూవీకి సంబంధించిన ఎలాంటి అప్ డేట్ లేదు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



