'రాజధాని ఫైల్స్' చిత్రానికి జన నీరాజనం
on Feb 14, 2024

'రాజధాని ఫైల్స్' చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. రాజధాని కోసం భూములు త్యాగం చేసిన వేలాది రైతుల కన్నీటి గాథను కళ్ళకి కట్టినట్టు చూపించారంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇది రాజకీయ సినిమా కాదని, రైతుల సినిమా అని అంటున్నారు.
శ్రీమతి హిమ బిందు సమర్పణలో తెలుగువన్ ప్రొడక్షన్స్ పతాకంపై కంఠంనేని రవిశంకర్ నిర్మించిన చిత్రం 'రాజధాని ఫైల్స్'. భాను దర్శకత్వం వహించిన ఈ చిత్రం నేడు(ఫిబ్రవరి 15న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే తెలుగునాట పలు చోట్ల బుధవారం సాయంత్రం నుంచే ప్రీమియర్ షోలు మొదలయ్యాయి. మొదటి షో నుంచే ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వస్తోంది.
రాజధాని రైతులతో పాటు సాధారణ ప్రేక్షకులు సైతం 'రాజధాని ఫైల్స్' సినిమా చూడటానికి థియేటర్ల బాట పడుతున్నారు. ఇలాంటి సినిమాలు అరుదుగా వస్తాయని, తెలుగువారంతా ఈ చిత్రాన్ని ఖచ్చితంగా చూడాలని చెబుతున్నారు. ఇందులో రైతుల సమస్య గురించి చెప్పడమే కాకుండా, దానికి సినిమాలో పరిష్కారం చూపించడం అద్భుతమని కొనియాడుతున్నారు. తెలుగు సినిమా చరిత్రలోనే ఇలాంటి క్లైమాక్స్ రాలేదని, ఈ సినిమా క్లైమాక్స్ లో చూపించిన పరిష్కారం.. నిజ జీవితంలో జరిగితే రాష్ట్ర భవిష్యత్ బాగుంటుందని అంటున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



