రాక్‌స్టార్ రాయ్‌లక్ష్మిని చూశారా?
on Oct 19, 2019
హిట్టు ఫ్లాపులతో సంబంధం లేకుండా రాయ్‌లక్ష్మి వరుసగా సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళుతుంది. ఎప్పటికప్పుడు హాట్ హాట్ స్టిల్స్‌ను ఇంటర్నెట్లో విడుదల చేస్తూ ప్రేక్షకుల్లో తన ఉనికిని నిలుపుకుంటోంది. తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో రాయ్‌లక్ష్మి సినిమాలు చేస్తుండటం వల్ల ఓ భాషలో నిర్మించిన సినిమాను మరో భాషలో డబ్బింగ్ చేసే వీలుంది. డబ్బింగ్ రైట్స్ రూపంలో నిర్మాతలకు ఎంతోకొంత మొత్తం వస్తోంది. దాంతో రాయ్‌లక్ష్మి చేతిలో ఎప్పుడూ ఏదో ఒక సినిమా ఉంటోంది. లేటెస్టుగా తమిళంలో ఆమె నటిస్తున్న ‘సిండ్రెల్లా’ సినిమా టీజర్ విడుదలైంది. ఇందులో రాయ్‌లక్ష్మి రాక్‌స్టార్ అకిరా పాత్రలో నటించింది. అలాగే, దెయ్యంగానూ కనిపించనుంది. ఈ సినిమా అయినా ఆమెకు హిట్ ఇస్తుందో? లేదో? వెయిట్ అండ్ సీ!