మాస్ జాతర తర్వాత రవితేజ విజ్ఞప్తి..!
on Nov 10, 2025

ఇటీవల 'మాస్ జాతర'తో ప్రేక్షకులను పలకరించారు మాస్ మహారాజా రవితేజ. వరుస పరాజయాల్లో ఉన్న రవితేజ, ఈ సినిమాతో కమ్ బ్యాక్ ఇవ్వాలని చూశారు. కానీ, 'మాస్ జాతర' కూడా మెప్పించలేకపోయింది. దీంతో నెక్స్ట్ సినిమాపైనే అభిమానులు ఆశలు పెట్టుకున్నారు.
రవితేజ తన 76వ సినిమాని కిషోర్ తిరుమల దర్శకత్వంలో చేస్తున్నారు. ఎస్ఎల్వీ సినిమాస్ నిర్మిస్తున్న ఈ మూవీ, 2026 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకి 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' అనే టైటిల్ ని ఖరారు చేసినట్లు ఇటీవల వార్తలొచ్చాయి. ఇదే టైటిల్ ని అధికారికంగా ప్రకటిస్తూ తాజాగా మేకర్స్ ఒక పోస్టర్ ను వదిలారు. రవితేజ నమస్కారం చేస్తున్నట్టుగా ఉన్న ఈ పోస్టర్ ఆకట్టుకుంటోంది.
Also Read: తెలంగాణ సాహితీ శిఖరం 'అందెశ్రీ' కంటతడి పెట్టిన సందర్భం..!
'భర్త మహాశయులకు విజ్ఞప్తి' అనే టైటిల్ ని బట్టి చూస్తే.. ఇదొక ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనిపిస్తోంది. సంక్రాంతి సీజన్ లో ఈ తరహా సినిమాలకు మంచి ఆదరణ ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు.
రవితేజ కామెడీ టైమింగ్ ఎలా ఉంటుందో తెలిసిందే. అలాగే దర్శకుడు కిషోర్ తిరుమల ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ని అందించడంలో దిట్ట. అలాంటిది ఈ ఇద్దరు కలిసి 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' అనే టైటిల్ తో వస్తున్నారంటే.. ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీ అని చెప్పవచ్చు.
మరి ఈ సినిమాతో రవితేజ అదిరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చి.. ఫ్యాన్స్ ని ఖుషీ చేస్తారేమో చూడాలి.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



