మాస్ జాతర చూపిస్తున్న రవితేజ!
on Oct 30, 2024
మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) తన 75వ సినిమాని భాను భోగవరపు దర్శకత్వంలో చేస్తున్నాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ లో ఈ చిత్రం రూపొందుతోంది. దీపావళి కానుకగా నేడు ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ తో పాటు.. రిలీజ్ డేట్ ని మేకర్స్ రివీల్ చేయడం విశేషం.
రవితేజ 75వ చిత్రానికి "మాస్ జాతర" (Mass Jathara) అనే పవర్ ఫుల్ టైటిల్ ను పెట్టారు. ఈ సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ బాగుంది. జాతర సందడిలో, దీపావళి పండుగను తలపిస్తూ టపాసుల వెలుగుల నడుమ, గన్ తో విధ్వంసం సృష్టించినట్టుగా నడిచి వస్తున్న రవితేజ పోస్టర్ ఆకట్టుకుంటుంది. అంత విధ్వంసం తర్వాత కూడా రవితేజ మార్క్ కి తగ్గట్టుగా.. చేతిలో గంట పట్టుకొని కొడుతున్నట్టుగా ఉండటం భలే ఉంది. ఇక ఈ సినిమాని మే 9, 2025న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య భారీ ఎత్తున ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీలీల కథానాయిక. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా విధు అయ్యన్న, ఎడిటర్ గా నవీన్ నూలి వ్యవహరిస్తున్నారు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
