'ఆర్ఆర్ఆర్' టీజర్ కి ముహూర్తం ఫిక్స్!
on Oct 14, 2021
`బాహుబలి` సిరీస్ తరువాత దర్శకధీరుడు రాజమౌళి నుంచి రాబోతున్న చిత్రం `ఆర్ ఆర్ ఆర్`. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో రూపొందిన ఈ క్రేజీ మల్టిస్టారర్ లో బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్, విదేశీ సోయగం ఓలివియా మోరీస్ నాయికలుగా నటించారు. అజయ్ దేవగణ్, శ్రియ, సముద్రకని ముఖ్య పాత్రల్లో దర్శనమివ్వనున్నారు. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ పాన్ - ఇండియా మూవీ.. సంక్రాంతి కానుకగా జనవరి 7న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.
ఇదిలా ఉంటే.. తారక్ పోషించిన కొమురం భీమ్, చరణ్ ధరించిన అల్లూరి సీతారామరాజు పాత్రలకు సంబంధించి ఇప్పటికే వేర్వేరు స్పెషల్ వీడియోస్ ని రిలీజ్ చేసిన చిత్ర బృందం.. త్వరలో టీజర్ ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తోందట. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. దీపావళి సందర్భంగా `ఆర్ ఆర్ ఆర్` టీజర్ ని అన్ని భాషల్లోనూ ఏకకాలంలో విడుదల చేయబోతున్నారట. జక్కన్న స్థాయి విజువల్స్ తోనే ఈ టీజర్ ని రెడీ చేస్తున్నారని టాక్. మరి.. ఈ ప్రచారంలో వాస్తవమెంతో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచిచూడాల్సిందే.
కాగా, డీవీవీ దానయ్య ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన `ఆర్ ఆర్ ఆర్`కి స్వరవాణి కీరవాణి బాణీలు అందించారు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
