'ఆర్ఆర్ఆర్'... షెడ్యూల్ ముందుకు!
on Sep 22, 2020
వీలైనంత త్వరగా 'ఆర్ఆర్ఆర్' చిత్రీకరణ పూర్తి చేసి తరవాత సినిమాలు ప్రారంభించాలని ఎన్టీఆర్, రామ్ చరణ్ భావిస్తున్నారు. అందుకని, రాజమౌళి కూడా త్వరగా పూర్తి చేయాలనుకుని షెడ్యూల్ ముందుకు జరిపారట. అక్టోబర్ నెలలో 'ఆర్ఆర్ఆర్' చిత్రీకరణ మళ్లీ ప్రారంభించాలని అనుకున్నారు. విజయదశమి తరవాత సెట్స్ మీదకు వెళ్లాలని ప్లాన్ చేశారు. కానీ, ఇప్పుడు విజయదశమికి ముందుకు రావాలని డిసైడ్ అయ్యారట.
అక్టోబర్ రెండో వారంలో 'ఆర్ఆర్ఆర్' కొత్త షెడ్యూల్ మొదలు కానుందట. ప్రస్తుతం టీమ్‌తో రాజమౌళి షెడ్యూల్ ప్లానింగ్ గురించి డిస్కస్ చేస్తున్నారట. టీమ్ సలహాలు, సూచనలు తీసుకుని షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారట. అక్టోబర్ 22న కొమరం భీమ్ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ టీజర్ విడుదల చేయాలని అనుకుంటున్నారట. భీమ్ పాత్రలో ఎన్టీఆర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. అందుకని, విజయదశమికి ముందు షూటింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారట. ఇందులో అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ నటిస్తున్నారు.