వర్మను లైట్ తీసుకున్న మెగా ఫాన్స్?
on Jul 9, 2020
సోషల్ మీడియా వేదికగా రామ్ గోపాల్ వర్మ కొత్త సినిమా ఫొటోలతో హడావిడి చేయడం స్టార్ట్ చేశారు. 'పవర్ స్టార్' టైటిల్లో, ఇప్పటివరకు విడుదల చేసిన స్టిల్స్‌లో ఆయన ఎవరిని టార్గెట్ చేశారనేది క్లియర్ కట్‌గా ఎల్‌కెజి పిల్లాడికి అయినా సరే తెలుస్తుంది. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో పాటు పవన్ ఆప్త మిత్రుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ను సైతం వర్మ టార్గెట్ చేశారు. అదే మాట ఆయనతో అంటే ఎప్పటిలా డొంకతిరుగుడు సమాధానాలు చెబుతున్నారు. వర్మ సినిమాలో హీరో పాత్రధారి ఎవరిలా ఉన్నాడని అడిగితే ఠక్కున సమాధానం ఇస్తారు.
వర్మ మాత్రం తన సినిమాలో హీరో పేరు పవర్‌స్టార్ అనీ, అందుకే పవర్‌స్టార్ టైటిల్ పెట్టాననీ... పవన్ కల్యాణ్‌కి, ఈ సినిమాకి సంబంధం లేదనీ, కావాలంటే పవన్ అభిమానుల మీద ఒట్టేస్తాననీ... ఎవరైనా గుర్తొస్తే యాదృశ్చికమేననీ అంటున్నారు. కానీ, వర్మ పోస్టర్లను ఎవరైనా సీరియస్ గా తీసుకుంటే పెద్ద వివాదం అయ్యేలా ఉంది. త్రివిక్రమ్ మీద చేసుకున్నట్టు ఒక స్టిల్ విడుదల చేశారు.
మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులను కెలకాలని వర్మ తీవ్రంగా ట్రై చేస్తున్నారు. కానీ, ఈసారి అభిమానులలో కొందరు తప్ప పెద్దగా ఎవరూ పట్టించుకున్నట్టు కనిపించడం లేదు. వర్మ ట్వీట్స్ కింద మెగాభిమానుల కంటే ఇతర హీరోల అభిమానుల ట్వీట్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. దాంతో వర్మకు కావలసిన క్రేజ్ వచ్చింది. ఏటీటీలో విడుదల చేసినప్పుడు యాంటీ ఫాన్స్ చూసినా బడ్జెట్ కంటే ఎక్కువ డబ్బులు లాక్కోవచ్చు.
Also Read