వర్మ బయోపిక్ టైటిల్ కాంట్రవర్సీ
on Jan 11, 2020

ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఆర్జీవీ అంటే రామ్ గోపాల్ వర్మ. ఆయనొక బ్రాండ్. హిట్టు ప్లాపులతో సంబంధం లేకుండా ప్రతి సినిమాతో వార్తల్లో నిలిచే వ్యక్తి. ఒకప్పుడు సెన్సేషనల్ ఫిలింస్ తీసిన ఈయన, ఇప్పుడు సెన్సేషన్ కోసం ఏదో విధంగా ఎవరో ఒకరి పరువు తీయడమే ధ్యేయంగా సినిమాలు తీస్తున్నట్టు ఉంది. కాంట్రవర్షియల్ బయోపిక్స్ తీస్తున్న, బయోపిక్స్ ను కాంట్రవర్షియల్ చేస్తున్న వర్మ మీద గేయ రచయిత జొన్నవిత్తుల మొన్నామధ్య విరుచుకుపడ్డారు. వర్మ బయోపిక్ తీస్తున్నట్టు ప్రకటించారు. తీస్తున్నారు కూడా. దానికి ఆయనే కథ, మాటలు సమకూర్చారు. దర్శకుడు, నిర్మాత కూడా ఆయనే.
వర్మ బయోపిక్ కి 'ఆర్జీవీ' టైటిల్... 'ఒక సైకో బయోపిక్' క్యాప్షన్ అనుకున్నారు. తెలుగు ఫిలిం ఛాంబర్ లో టైటిల్ రిజిస్టర్ చేయించడానికి వెళితే... వర్మ నుండి నోఅబ్జెక్షన్ లెటర్ తీసుకురమ్మని అడిగారట. ఇక్కడ వర్మ తరహాలో జొన్నవిత్తుల కూడా టైటిల్ విషయంలో తెలివి చూపించారు. 'ఆర్జీవీ' అంటే 'రామ్ గోపాల్ వాద్రా' అని చెబుతున్నారు. 'అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు' సినిమాలో ఎంతోమంది ప్రముఖులకు వర్మ ఇటువంటి పేర్లు పెట్టిన సంగతి తెలిసిందే. ఆ సినిమాకు, అంతకు ముందు 'వంగవీటి', 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాలకు వర్మ ఎవరి దగ్గరనుండి నో అబ్జెక్షన్ లెటర్స్ తీసుకు వచ్చారని జొన్నవిత్తుల పాయింట్ మాట్లాడుతున్నారు. వర్మ తీసే సినిమాలే కాదు... వర్మ మీద తీస్తున్న సినిమా కూడా వివాదంలో ఉందిప్పుడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



