'RC 16' టైటిల్, ఫస్ట్ లుక్ కి ముహూర్తం ఫిక్స్..!
on Feb 26, 2025
రామ్ చరణ్ (Ram Charan) తన 16వ సినిమాని 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. 'RC 16' అనేది వర్కింగ్ టైటిల్. 'పెద్ది' అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో రామ్ చరణ్ పాత్ర పవర్ ఫుల్ గా ఉంటుందని, 'రంగస్థలం'లో పోషించిన చిట్టిబాబు పాత్రకు ఎంత పేరు వచ్చిందో, అంత పేరు వస్తుందని అంటున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ మూవీ ఫస్ట్ లుక్ కి ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది.
రామ్ చరణ్ పుట్టినరోజు కానుకగా మార్చి 27న 'RC 16' ఫస్ట్ లుక్ ను విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. ఇందులో హీరో పాత్రని దర్శకుడు బుచ్చిబాబు అద్భుతంగా డిజైన్ చేశాడని, చరణ్ లుక్ ఓ రేంజ్ లో ఉంటుందని చెబుతున్నారు. రామ్ చరణ్ లుక్ తో పాటు, మూవీ టైటిల్ ని కూడా.. ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే రివీల్ చేయనున్నారట. మరి ఈ సినిమాకి ముందు నుంచి ప్రచారం జరుగుతున్నట్టుగా 'పెద్ది' టైటిల్ నే లాక్ చేశారో, లేక వేరే ఏదైనా కొత్త టైటిల్ వైపు మొగ్గుచూపారో అనేది మార్చి 27న తేలిపోనుంది.
మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ తో కలిసి వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
