రేపే 'RC 16' ప్రకటన.. దర్శకుడు ఎవరో తెలుసా?
on Nov 27, 2022

తన 15వ సినిమాని శంకర్ దర్శకత్వంలో చేస్తున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 16వ సినిమాని గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చేయాల్సి ఉండగా అది అటకెక్కిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో సినిమా చేయడానికి చరణ్ అంగీకరించాడని, అధికారిక ప్రకటన రావడమే ఆలస్యమని వార్తలు వినిపించాయి. అయితే ఈ మూవీ అఫీషియల్ అనౌన్స్ మెంట్ రేపే రాబోతుంది.
'ఉప్పెన'(2021)తో దర్శకుడిగా పరిచయమై మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న బుచ్చిబాబు.. తన రెండో సినిమాని జూనియర్ ఎన్టీఆర్ తోనే చేయాలని చాలాకాలం ఎదురుచూశాడు. ఎన్టీఆర్ కోసం 'పెద్ది' అనే పవర్ ఫుల్ స్పోర్ట్స్ డ్రామాను రాశాడు. అయితే ఎన్టీఆర్ ఇప్పటికే తన 30వ సినిమాని కొరటాల శివతో, 31వ సినిమాని ప్రశాంత్ నీల్ తో ప్రకటించాడు. ఈ రెండు సినిమాలు పూర్తి కావాలంటే కనీసం రెండేళ్లు పడుతుంది. అందుకే బుచ్చిబాబు ఆ 'పెద్ది' చిత్రాన్ని చరణ్ తో చేయడానికి సిద్ధమయ్యాడని ఇటీవల బలంగా వార్తలు వినిపించాయి. ఇప్పుడు ఈ వార్తలు నిజమై అధికారిక ప్రకటన కూడా రాబోతోంది.
రేపు ఉదయం 'RC 16' ప్రకటన రాబోతోంది. బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంతో సతీష్ కిలారు నిర్మాతగా పరిచయం కానున్నారని సమాచారం. మరిన్ని వివరాలు రేపు తెలియనున్నాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



