'పుష్ప' పార్టీ ఇచ్చాడు.. ఎవరికో తెలుసా?
on Dec 28, 2021

'పుష్ప' సినిమాలో 'తగ్గేదేలే' డైలాగ్ ఎంత ఫేమస్ అయిందో, 'పార్టీ లేదా పుష్ప' అనే డైలాగ్ కూడా అంతే ఫేమస్ అయింది. డిసెంబర్ 17 న విడుదలైన 'పుష్ప ది రైజ్' భారీ వసూళ్లతో తగ్గేదేలే అన్నట్లుగా దూసుకుపోతుండటంతో.. అందరూ 'సక్సెస్ పార్టీ లేదా పుష్ప' అని అడుగుతున్నారు. తాజాగా పుష్ప రాజ్.. మూవీ టీమ్ తో పాటు టాలీవుడ్ కి చెందిన పలువురు డైరెక్టర్స్ తో పార్టీ చేసుకొని 'పార్టీ లేదా పుష్ప'కు ఇదే నా సమాధానం అంటున్నాడు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ 'పుష్ప ది రైజ్'. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా ఇటీవల విడుదలై కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇందులో పుష్ప రాజ్ పాత్రలో బన్నీ ఒదిగిపోవడంపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. విజయానందంలో ఉన్న పుష్ప రాజ్ మూవీ టీమ్ తో కలిసి సక్సెస్ మీట్లు నిర్వహిస్తున్నాడు. అయితే అందరూ పార్టీ లేదా పుష్ప అని అడుగుతుండటంతో తాజాగా టాలీవుడ్ సెలబ్రిటీలతో కలిసి పార్టీ చేసుకున్నాడు.

పుష్ప ఇచ్చిన సక్సెస్ పార్టీలో మూవీ టీమ్ తో పాటు టాలీవుడ్ కి చెందిన పలువురు డైరెక్టర్స్ పాల్గొన్నారు. వారిలో రాఘవేంద్ర రావు, కొరటాల శివ, సందీప్ రెడ్డి వంగా, రాధ కృష్ణ కుమార్, గోపిచంద్ మలినేని, మోహన్ కృష్ణ ఇంద్రగంటి, వంశీ పైడిపల్లి, అవసరాల శ్రీనివాస్, సంపత్ నంది, హను రాఘవపూడి, శివ నిర్వాణ, శ్రీకాంత్ అడ్డాల, రాహుల్ సాంకృత్యాన్ తదితరులు ఉన్నారు. పుష్ప పార్టీలో సందడి చేసిన వీరు పుష్ప టీమ్ కి శుభాకాంక్షలు తెలిపారు.

'పార్టీ లేదా పుష్ప'కి సమాధానం అంటూ ఈ పార్టీకి సంబంధించిన ఫోటోలను బన్నీ సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



