పుష్ప పార్ట్ 1 రిలీజ్ డేట్ వచ్చేసింది
on Aug 3, 2021
అల్లు అర్జున్, రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'పుష్ప'. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోన్న పుష్ప రెండు భాగాలుగా విడుదల కానుంది. తాజాగా మొదటి భాగం విడుదల తేదీని మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించింది.
పుష్ప మొదటి భాగాన్ని క్రిస్మస్ కానుకగా ఈ ఏడాది డిసెంబర్ లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ మంగళవారం ప్రకటించారు. మూవీ రిలీజ్ గురించి అప్డేట్ ఇస్తూ పోస్టర్ ని వదిలారు. కాగా పుష్ప కూడా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నిలిచే అవకాశముందని ఇటీవల ప్రచారం జరిగింది. ఇప్పటికే సంక్రాంతి బరిలో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్ ఉన్నారు. అల్లు అర్జున్ కూడా తోడైతే సంక్రాంతి పోరు మరింత రసవత్తరంగా మారుతుంది అనుకున్నారంతా. కానీ అల్లు అర్జున్ మాత్రం కాస్త ముందుగానే బాక్సాఫీస్ వద్ద సత్తా చూపడానికి సిద్ధమవుతున్నాడు. గత ఏడాది 'అల వైకుంఠపురములో'తో భారీ హిట్ అందుకున్న అల్లు అర్జున్.. పుష్పతో ఈసారి ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి.
ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మలయాళ నటుడు ఫహద్ ఫజల్ విలన్‌గా కనిపించనున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా మొదటి పాట ఈ నెల 13 న విడుదల కానుంది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
