క్లైమాక్స్ కి చేరిన అల్లు అర్జున్ చరిత్ర
on Aug 5, 2024
.webp)
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(allu arjun)ఆర్మీ కి ఒక గుడ్ న్యూస్. ఇది అలాంటి ఇలాంటి గుడ్ న్యూస్ కాదు. మీరు ఆనందంతో ఎగిరి గంతేసే న్యూస్. ఇంక మీరు ఎవరి ముందు తలదించుకోవాల్సిన పని లేదు. సగర్వంగా తల ఎత్తుకొని నేను చెప్పబోయే న్యూస్ ని అవతలి వాళ్ళకి చెప్తారు.
బన్నీ అప్ కమింగ్ మూవీ పుష్ప 2(pushpa 2)సుకుమార్(sukumar)దర్శకుడు. అగస్ట్ 15 న రావాల్సిన మూవీ డిసెంబర్ 6 కి పోస్ట్ పోన్ అవ్వడంతో అభిమానులు కొంచం డల్ అయ్యారు. మూవీ క్వాలిటీ కోసమే లేటని మేకర్స్ చెప్పడంతో తమ కోసమేగా అని సర్ది చెప్పుకున్నారు. ఆ తర్వాత రన్నింగ్ లో ఉన్న షూటింగ్ సడన్ గా ఆగిపోవంతో ఆర్మీ లో కంగారు మొదలయ్యింది బన్నీ సుకుమార్ మధ్య గొడవలు జరగడంతో సుక్కు ఫారెన్ వెళ్లాడనే పుకార్లు కూడా వచ్చాయి. పైగా ఆ టైం లోనే బన్నీ పుష్ప గెటప్ తో కాకుండా వేరే గెటప్ తో కనపడేసరికి ఆ పుకార్లకు సరైన న్యాయం జరిగినట్టయ్యింది. దీంతో బన్నీ ఫ్యాన్స్ లో డిసెంబర్ 6 న అయినా వస్తుందా అని టెన్షన్. ఆ డేట్ మారిందనే వార్తలు కూడా అనధికారికంగా చాలానే వచ్చాయి. కానీ లేటెస్ట్ సమాచారం ప్రకారం పుష్ప 2 క్లైమాక్స్ షూట్ ని జరుపుకుంటుంది ఇంత వరకు ఏ చిత్రంలో తెరకెక్కని విధంగా ఒక అద్భుతమైన యాక్షన్ ఎపిసోడ్‌ను యూనిట్ చిత్రీకరిస్తోంది.ఈ మేరకు చిత్ర బృందం అధికారకంగా ప్రకటించింది. రేపు థియేటర్‌లో ఆ పతాక సన్నివేశాలు గూస్ బంప్స్ వచ్చే విధంగా ఉంటాయని కూడా వెల్లడి చేసారు.

పుష్ప పార్ట్ 1 లో క్లైమాక్స్ ఎంత కొత్తగా ఉంటుందో అందరకి తెలిసిందే. ఎవరు ఊహించని విధంగా తెరకెక్కి ఇండియా మొత్తాన్ని మెస్మరైజ్ చేసింది. ఇక ఇప్పుడు పార్ట్ 2 లో కూడా అదే స్థాయిలో ఉంటుందనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇంకా చెప్పాలంటే అంతకు మించి అని కూడా చెప్పవచ్చు. మోస్ట్ లీ రష్మిక తో సహా పార్ట్ 1 ఆర్టిస్టులే పార్ట్ 2 లో కూడా ఉండబోతున్నారు. పుష్ప రైజింగ్ చరిత్ర ఏ విధంగా ఉండబోతోందనే ఆసక్తి ఆర్మీ తో పాటు ప్రేక్షకుల్లో కూడా ఉంది.మైత్రీ మూవీ మేకర్స్(mythri movie makers)నిర్మాతలు కాగా ఇప్పటికే రిలీజైన రెండు పాటలు ఇండియా మొత్తాన్ని షేక్ చేస్తున్నాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



