నితిన్ సరసన బన్నీ ప్రేయసీ...?
on Aug 1, 2013
"ఇద్దరమ్మాయిలతో" చిత్రం తర్వాత పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో నితిన్ హీరోగా "హార్ట్ ఎటాక్" అనే చిత్రం తెరకెక్కనున్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ చిత్రంలో నితిన్ సరసన హీరోయిన్ గా ఎవరిని తీసుకోవాలని పూరీ చాలా మంది అమ్మాయిలను అనుకున్నాడట. కానీ వాళ్లెవరు కూడా పూరీకి నచ్చలేరంట.
అయితే "ఇద్దరమ్మాయిలతో" చిత్రంలో తన అందాలతో కుర్రకారు మతిపోగోట్టిన కేథరిన్ ను హీరోయిన్ గా ఫైనల్ చేసాడని తెలిసింది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయని, త్వరలోనే ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుందని తెలిసింది.
నితిన్ ప్రస్తుతం "కొరియర్ బాయ్ కళ్యాణ్" చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం తర్వాత "హార్ట్ ఎటాక్" చిత్రం ప్రారంభం కానుంది.