మహేష్ పేరుతో రామ్ సినిమా టైటిల్!!
on Dec 28, 2018
ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుందో ఆడే పండుగాడు అంటూ `పోకిరి` సినిమాలో మహేష్ తో పూరి చెప్పించిన డైలాగ్ గుర్తుంది కదా. లేకుండా ఎలా ఉంటుంది లేండి. ఆ డైలాగ్ అంత ఫేమస్సపోయింది మరి. పోకిరి లో మహేష్ పేరునే పూరి తన తదుపరి సినిమాకు ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా డాషింగ్ డైరక్టర్ పూరి జగన్నాథ్ ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. పూరి జగన్నాత్ టూరింగ్ టాకీస్ పై ఈ సినిమా రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన వర్క్ కూడా ప్రారంభించాడు పూరి.
ఈ సినిమాను జనవరిలో షూటింగ్ ప్రారంభించి 2019 మేలో రిలీజ్ చేయడానికి పూరి జగన్నాథ్ ప్లాన్ చేసాడు. రామ్ , పూరి కాంబినేషన్ లో ఇదే తొలి సినిమా. హీరోలను స్టైలిష్గా, డైనమిక్ గా చూపించడంలో పూరి దిట్ట. ఇప్పటికే ఈసినిమా కోసం రామ్ డిఫరెంట్ లుక్ లో తయారయ్యాడు. మరి పండుగాడుగా రామ్ ని ఎలా చూపించబోతున్నాడో అంటూ అటు పూరి, ఇటు రామ్ అభిమానుల్లో ఇప్పటికే ఆసక్తి నెలకొంది. వరుస ఫ్లాపులతో విసిగిపోయిన పూరి ఈ సినిమాతో ఎలాగైనా సక్సెస్ కొట్టి సక్సెస్ ట్రాక్ లో రావాలన్న కసితో పని చేస్తున్నట్లు తెలుస్తోంది.