రాజాసాబ్ టీజర్ లాంచ్ లో ఎస్.కె.ఎన్ సంచలనం.. మగతనం అంటూ కామెంట్స్!
on Jun 16, 2025
సినిమా ఈవెంట్ ఏదైనా నిర్మాత ఎస్.కె.ఎన్ మాట్లాడితే.. ఆ స్పీచ్ వైరల్ అవుతుంటుంది. తాజాగా 'ది రాజా సాబ్' టీజర్ లాంచ్ ఈవెంట్ లో ఎస్.కె.ఎన్ హాట్ టాపిక్ గా మారింది. 'రాజా సాబ్' గురించి ఓ నిర్మాత పనిగట్టుకొని మరీ.. నెగటివ్ క్యాంపెయిన్ చేశాడు అంటూ ఆయన చేసిన కామెంట్స్ ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతోన్న మూవీ 'ది రాజా సాబ్'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ హారర్ ఫాంటసీ ఫిల్మ్ డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. నేడు(జూన్ 16) హైదరాబాద్ లోని ప్రసాద్స్ మల్టీప్లెక్స్ లో టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది.
ఈ సందర్భంగా ఎస్.కె.ఎన్ మాట్లాడుతూ.. "మొగుడి మగతనం భార్యకే తెలుస్తుంది. అలాగే స్నేహితుడి పొటెన్షియాలిటీ.. క్లోజ్ గా ఉండే ఒక బెస్ట్ ఫ్రెండ్ కే తెలుస్తుంది. 20 ఏళ్లుగా మారుతితో ట్రావెల్ అవుతున్నాను. రాసిపెట్టుకోండి. ఈ సినిమాని ఎవరైతే తక్కువంచనా వేశారో వాళ్ళకి చెప్తున్నా. అన్ని రికార్డులు బ్రేక్ అవుతాయి. 10-12 ఏళ్లుగా మిస్ అవుతున్న రెబల్ గాడ్ ప్రభాస్ గారిని మళ్ళీ తీసుకొస్తున్నాడు. ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు ఒక ప్రొడ్యూసర్ నెగటివ్ క్యాంపెయిన్ చేశాడు. ఆ నెగటివ్ క్యాంపెయిన్ చేసిన ప్రొడ్యూసరే.. రేపు పాజిటివ్ ట్రెండ్ చేస్తాడు. ఇలా మన సినిమా మీద నెగటివ్ చేస్తారు అని మారుతికి చెప్తే.. అవన్నీ పట్టించుకోకుండా.. నన్ను నమ్మిన ప్రభాస్ గారికి బెస్ట్ ఇస్తానని అన్నాడు. ఇది జస్ట్ టీజర్. డిసెంబర్ 5న పాన్ ఇండియా షేక్ అవుద్ది." అన్నాడు.
ఎస్.కె.ఎన్ స్పీచ్ తర్వాత.. 'ది రాజా సాబ్' గురించి నెగటివ్ క్యాంపెయిన్ చేసిన ఆ ప్రొడ్యూసర్ ఎవరనే చర్చ.. అటు ఇండస్ట్రీ వర్గాల్లోనూ, ఇటు అభిమానుల్లోనూ మొదలైంది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
