నిర్మాత ఏఎం రత్నంకు అస్వస్థత.. అసలేం జరిగింది..?
on May 30, 2025

ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం (AM Rathnam) అస్వస్థతకు గురైనట్లు ఈ ఉదయం వార్తలొచ్చాయి. పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా ఏఎం రత్నం సమర్పణలో దయాకర్ రావు నిర్మిస్తున్న 'హరి హర వీరమల్లు' చిత్రం జూన్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం తుది మెరుగులు దిద్దుతున్నారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం ఏఎం రత్నం మూవీ ఆఫీస్ కి వెళ్ళగా.. సడెన్ గా హై బీపీతో కళ్ళు తిరిగి పడిపోయారని న్యూస్ వినిపించింది. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారని.. చికిత్స అందించిన వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారని ప్రచారం జరిగింది.
ఏఎం రత్నం ఆరోగ్యం గురించి సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నిర్మాత దయాకర్ స్పందించారు. "అన్నయ్య ఏఎం రత్నం స్పృహ తప్పి పడిపోయాడనే పుకార్లను నమ్మవద్దు. ఆయన పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారు. దయచేసి తప్పుడు సమాచారం వ్యాప్తి చేయకుండా ఉండండి." అని దయాకర్ ట్వీట్ చేశారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



