పవన్‌తో నేను చచ్చినా ఒప్పుకోను!
on Jan 19, 2023

పబ్లిసిటీలో ఒక్కొక్కరిది ఒక్కొక్క తరహా. పుర్రెకో బుద్ధి... జిహ్వకో రుచి అన్నట్టుగా పబ్లిసిటీ పిచ్చి పలు రకాలు. కొందరు మాటలతో పొగడ్తలతో కొందరిని ప్రసన్నం చేసుకొని పబ్లిసిటీ పొందాలని చూస్తారు. మరికొందరు వారంటే తమకు లెక్కలేనట్లు నటిస్తూ డోంట్ కేర్ అన్నట్టు ప్రవర్తిస్తూ వారి దృష్టిలో పడాలని తమ ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉంటారు.
ఇక విషయానికి వస్తే ఆంధ్ర ప్రదేశ్ లోని రాయలసీమకు చెందిన అనంతపురం జిల్లా వాసి నటి ప్రియాంక జవాల్కర్. హైదరాబాదులో ఫ్యాషన్ టెక్నాలజీలో పట్టా పుచ్చుకుంది. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో చదువు పూర్తి చేసిన ఆమె మోడల్‌గా ఆకట్టుకుంటుంది. విజయ్ దేవరకొండ నటించిన టాక్సీవాలా, సత్యదేవ్ నటించిన తిమ్మరుసు, కిరణ్ అబ్బవరం నటించిన ఎస్ఆర్ కళ్యాణ మండపం, గమనం వంటి చిత్రాలలో హీరోయిన్‌గా నటించింది. ఇందులో టాక్సీవాలా మంచి విజయాన్ని సాధించింది. ఎస్ఆర్ కళ్యాణ మండపం కూడా కమర్షియల్ గా హిట్టయింది. కానీ ఎందుకనో ఈ భామకు సరైన అవకాశాలు రావడం లేదు. దాంతో పవన్ పేరు ప్రస్తావన తెస్తే తనకు పబ్లిసిటీ లభించి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతానని భావించిందో ఏమో...
ఇక విషయానికి వస్తే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పక్కన హీరోయిన్‌గా ఛాన్స్ వస్తే ఎవరైనా ఎగిరి గంతులేస్తారు. ఆయనతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం వచ్చిందని డేట్స్ సర్దుబాటు చేసుకుంటారు. అలాంటిది తనకు పవన్ పక్కన ఛాన్స్ వస్తే మాత్రం చచ్చినా చేయనంటుంది ఈ యంగ్ బ్యూటీ ప్రియాంక జవాల్కర్. అయితే ఇందుకు బలమైన కారణం ఉందని ఆమె అంటుంది. నాకు పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి. ఆయనంటే పడి చస్తాను. పవన్ తమ్ముడు సినిమాను 20 సార్లు చూశాను. ఖుషీ సినిమాలోని ప్రతి డైలాగు నాకు గుర్తుంది. నేను పవన్ కళ్యాణ్ కు పెద్ద ఫ్యాన్ ని. ఆయన్ను అలాగే దూరం నుంచి చూస్తూ అభిమానిగా ఉండిపోవాలని నాకు ఉంది. అంతకుమించి ఇంకేమీ కోరుకోవడం లేదు.
ఒకవేళ ఆయనతో సినిమా ఛాన్స్ వచ్చినా చెయ్యను. అంత పెద్ద స్టార్ అయ్యుండి అంత సింపుల్ గా ఎలా ఉంటారో నాకు అర్థం కావడం లేదు అని చెప్పుకొచ్చింది. ఎవరైనా స్టార్లతో ఒక సినిమా చేసి స్టార్డం పొందాలని అనుకుంటారు. కానీ ప్రియాంక మాత్రం విచిత్రంగా పవన్ సినిమాలో అవకాశం వచ్చినా చేయనంటోంది. ఇది కూడా పబ్లిసిటీ కోసమో లేదా మీడియా అటెన్షన్ కోసమో అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



