పుట్టబోయే పిల్లలపై లవ్ జిహాదీ కామెంట్స్
on Feb 27, 2025

హీరోయిన్ గా 2003లో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన కన్నడ భామ ప్రియమణి(Priyamani)ఆ తర్వాత పాన్ ఇండియా నటిగా,పలు భాషలకి చెందిన సినిమాల్లో నటించి తన సత్తా చాటింది.షారుఖ్ ఖాన్ హీరోగా వచ్చిన చెన్నైఎక్స్ ప్రెస్ లో చేసిన స్పెషల్ సాంగ్ తో అయితే ఇండియన్ సినీ పరిశ్రమ తనవైపు చూసేలా చేసుకుంది.ప్రస్తుతం క్యారక్టర్ ఆర్టిస్ట్ గాను తన సత్తా చాటుతు జవాన్, ఆర్టికల్ 370 ,మైదాన్ వంటి సినిమాలు చేస్తు ఫుల్ బిజీగా ఉంది. .
రీసెంట్ గా ప్రియమణి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతు నా పెళ్లి అయినప్పటి నుంచి కొంత మంది నన్ను టార్చర్ చెయ్యడమే పనిగా పెట్టుకున్నారు.నాకు పుట్టబోయే పిల్లలు గురించి కూడా కామెంట్స్ చేస్తున్నారు.నిజానికి నా ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత నా చుట్టూ ఉన్న వాళ్ళు ఎంతో ఆనందిస్తారని, వాళ్ళతో సంతోషకరమైన క్షణాలని పంచుకోవాలనుకున్నాను.కానీ అప్పట్నుంచి నాపై అనవసరమైన ద్వేషం మొదలయ్యింది.లవ్ జిహాదీ ఆరోపణలు వచ్చాయి.పిల్లలు పుట్టాక వాళ్ళని ఐసిస్ లో జాయిన్ చేస్తారా అని మెసేజెస్ చేసారు.నేను మీడియాపర్సన్ ని కాబట్టి ఇలాంటి మాటల్ని పట్టించుకోను.కానీ నా భర్త గురించి ఏం తెలుసనీ అలా మాట్లాడతారో అర్ధం కాదు.ఇప్పటికి నా భర్తతో దిగిన ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే పది మెసేజెస్ లో తొమ్మిది కామెంట్స్ మా పెళ్లి లవ్ జిహాదీ అంటు కామెంట్స్ చేస్తారు.ఆ విషయంలో చాలా బాధపడుతున్నాని చెప్పుకొచ్చింది.
ప్రియమణి హస్బెండ్ పేరు ముస్తఫా రాజ్(Musthafa raj)2017లో ఆ ఇద్దరు ప్రేమ వివాహం చేసుకున్నారు.ప్రియమణి ప్రస్తుతం తమిళ్ లో విజయ్(VIjay)హీరోగా తెరకెక్కుతున్న'జన నాయగన్'(Jana nayagan)లో కీలక పాత్ర పోషిస్తుంది.ఇదే కాకుండా పలు క్రేజీ ప్రాజెక్ట్స్ కూడా ఆమె ఖాతాలో ఉన్నాయి.ఫిబ్రవరి 20 న 'ఆఫీసర్ ఆన్ డ్యూటీ' అనే మలయాళ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



