ప్రియా వారియర్ అసలు గుట్టు చెప్పింది
on Jun 3, 2020

ప్రముఖ జ్యువెలరీ కంపెనీ అధినేత 'డబ్బులు ఎవరికీ ఊరికే రావు' అని ఒక వాణిజ్య ప్రకటనలో చెబుతారు. నిజమే, డబ్బులు ఎవరికీ ఊరికే రావు. అందులోనూ కథానాయికలకు అయితే అసలు రావు. సినిమాల కంటే షాప్ ఓపెనింగులు, సోషల్ మీడియాలో ప్రమోషన్లు చేస్తూ హీరోయిన్లు డబ్బులు వెనకేసుకుంటారని టాక్. అయితే సోషల్ మీడియాలో ఉన్న ప్రతి హీరోయిన్ కి ఊరికే డబ్బులు ఇవ్వరు. వాళ్లకు ఎంతమంది ఫాలోయర్లు ఉన్నారు? ఏయే భాషల ప్రేక్షకులు ఫాలో అవుతున్నారు? వంటివి పరిగణలోకి తీసుకుంటారు. అందుకే, హీరోయిన్లు సోషల్ మీడియా సైట్లలో యాక్టివ్ గా ఉంటూ ఉనికి నిలుపుకునే ప్రయత్నం చేస్తారు. సోషల్ మీడియాకి దూరంగా ఉండడమంటే సంపాదనకు దూరంగా ఉండడమే. ఇన్ డైరెక్టుగా వింక్ బ్యూటీ ప్రియా వారియర్ ఈ సంగతి చెప్పింది.
పదిహేను రోజుల క్రితం ప్రియా వారియర్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఎకౌంట్‌ను డీయాక్టివేట్ చేసింది. ఎందుకు చేసిందో ఎవరికీ అర్థం కాలేదు. కొంతమంది పబ్లిసిటీ కోసం చేసిందని కామెంట్స్ చేశారు. మళ్ళీ ఎకౌంటు యాక్టివ్ చేసిన ప్రియా వారియస్... లైకులు, ఫాలోలు, డిస్ లైకులు వంటి ప్రెజర్ భరించలేక సోషల్ మీడియాకి దూరంగా ఉన్నానని చెప్పింది. తర్వాత ఎక్కువ రోజులు దూరంగా ఉండే స్థోమత తనకు లేదని, ప్రొఫెషనల్ గా తప్పదని పేర్కొంది. స్థోమత అంటే డబ్బే. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక్కో ప్రమోషనల్ పోస్టుకు ప్రియా వారియర్ లక్షల్లో డబ్బులు తీసుకుంటుందని టాక్. అంత సంపాదనను ఎవరు వదులుకుంటారు?
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



