ద-బాంగ్ టూర్ కి ప్రభుదేవా రెడీ.. కోల్కతాలో లైవ్ డాన్స్ కన్సర్ట్
on May 10, 2023

ఇండియన్ మైకెల్ జాక్సన్‌గా పేరు తెచ్చుకున్న ప్రభుదేవా గురించి తెలియని వారంటూ ఎవరూ లేరు. అయన డాన్స్ కి ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే... ప్రభుదేవా ప్రస్తుతం రామ్ చరణ్ నటిస్తున్న ఆర్‌సి 15 మూవీలో ఒక పాటకు కొరియోగ్రఫీ చేస్తున్నాడు. రీసెంట్‌గా సైకలాజికల్ రొమాంటిక్ థ్రిల్లర్ 'బఘీరా' మూవీలో నటించాడు. అయితే ఆ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు కానీ తన యాక్టింగ్‌తో అందరినీ ఆకట్టుకున్నారు. అలాంటి ప్రభుదేవా కోల్కతాలో సందడి చేయడానికి రెడీ అయ్యాడు.
"కోల్‌కతా ద-బాంగ్ టూర్‌కు సిద్ధంగా ఉండండి - 13 మే 2023న రీలోడ్ తో ఈస్ట్ బెంగాల్ క్లబ్ కి వస్తున్నా " అంటూ తన ఇన్స్టాగ్రామ్ పేజీలో అభిమానుల కోసం ఒక అనౌన్స్మెంట్ ని ఇచ్చేసాడు. "చల్ మార్" పేరుతో ప్రభుదేవా తన డాన్స్ లైవ్ కన్సర్ట్స్ నిర్వహిస్తూ వరల్డ్ టూర్ చేస్తున్నాడు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన కోల్కతా వచ్చి అక్కడ దుమ్ము రేపడానికి రెడీ అయ్యారు. నటుడిగా, కొరియోగ్రాఫర్‌గా, డైరెక్టర్ గా సత్తా చాటిన ప్రభుదేవా.. తెలుగు, తమిళం, హిందీ ఆడియన్స్ ని ఎంతో అలరించారు. ఫేమస్ డాన్స్ మాస్టర్ సుందరం కొడుకుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ప్రభుదేవా చాలా తక్కువ టైములోనే ఒక మంచి ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



