ప్రభాస్ డార్లింగ్ ఎవరు?
on Jul 7, 2015
.jpg)
అందరితో డార్లింగ్ అని పిలిపించుకునే ప్రభాస్ డార్లింగ్ ఎవరంటారు? హా...ఇంకెవరు..అనుష్క, తమన్నా, ఇలియానాలో ఎవరో ఒకరు అయిఉంటారు అనుకున్నారా? అయితే మీరు పప్పులో కాలేసినట్టే. ఈ ఆరడుగుల అందగాడు ఆరడుగుల అమ్మాయిపై మనసుపడ్డాడట. తెలుగులో ఆ స్థాయి అమ్మాయి అంటే అనుష్క తప్ప ఇంకెవరున్నారు అంటే అసలు నా డార్లింగ్ ఇక్కడ లేదండీ బాబూ...బాలీవుడ్ లో ఉందన్నాడు. దీంతో అవాక్కవడం జనాలవంతైంది.
ఎందుకంటే ఇప్పటివరకూ ప్రభాస్ బాలీవుడ్ లో అడుగుపెట్టలేదు. బీ టౌన్ హీరోయన్లలో కంగనాతో తప్ప ఇంకెవరితోనూ సినిమా చేయలేదు. అలాంటింది ప్రభాస్ ని డిస్టబ్ చేసిన బ్యూటీ ఎవరబ్బా అంటే....పొడుగుకాళ్ల సుందరి దీపిక పదుకునే అని సిగ్గుపడుతూ చెప్పాడట. ఏంటో అంత స్పెషల్ అంటే....అమ్మడి నటన అదుర్స్ అయితే....ఆమె చూపులు చురకత్తుల్లా ఉంటాయని సెలవిచ్చాడట టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచలర్.
మరి బాలీవుడ్ లో బాహుబలి హిట్టై...అక్కడ ఆఫర్స్ వస్తే ప్రభాస్ సరసన హీరోయిన్ గా దీపిక మురిపిస్తుందేమో? అదేమీ పెద్ద కష్టం కూడా కాదు. అదే నిజమైతే ప్రభాస్-దీపిక జంటని చూసేందుకు రెండు కళ్లు సరిపోవేమో!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



