దటీజ్ బాహుబలి..!!
on Dec 9, 2015
.jpg)
టాలీవుడ్ స్టార్ హీరోలలో రెబెల్ స్టార్ ప్రభాస్ రూటే సపరేట్ అని చెప్పాలి. అందరి హీరోలతో చిన్న పెద్ద అని తేడాలు, ఎలాంటి ఈగోలు లేకుండా అందరితో కలిసిపోతుంటాడు. ఏ హీరో ఆడియో ఫంక్షన్ అయిన సరే పిలిస్తే ఎంత బిజీగా వున్న టక్కున ప్రత్యక్షమైపోతాడు. లేటెస్ట్ మెగా హీరో వరుణ్ తేజ్ 'లోఫర్' ఆడియోకి హాజరై.. తాను టాలీవుడ్ డార్లింగ్ ఎందుకు అయ్యాడే మరోసారి నిరూపించాడు.
కొన్ని నెలల క్రితం భీమవరంలో ప్రభాస్ పవన్ ఫ్యాన్స్ ఎంత పెద్ద గొడవ జరిగిందో అందరికీ తెలిసిందే. ఈ గొడవను సర్ది చెప్పడానికి ప్రభాస్ పవన్ లు రంగంలోకి దిగారు కూడా. తమ ఫ్యాన్స్ గ్రూప్ లను పిలిపించి సర్ది చెప్పారు. దీంతో గొడవ సద్దుమణిగింది. అయితే వేరే హీరోలు అయితే మళ్ళీ మెగా ఫంక్షన్ లో కనిపించడానికి కొంచెం సంకోచిస్తారు. కానీ డార్లింగ్ మాత్రం ఆ వివాదాన్ని అంతటితో ముగించడానికి మళ్ళీ మెగా ఫంక్షన్ లో మెరిశాడు.
లోఫర్ ఆడియో ఫంక్షన్ లో పవర్ స్టార్ అంటూ.. మెగా ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నా..తాను చాలా ఓపెన్ మైండ్ తో "ఐ లైక్ పవర్ స్టార్.. ఇప్పుడు మాట్లాడచ్చా" అనేశాడు ప్రభాస్. అంతేకాదు వరుణ్ తేజ్ ను దగ్గరుండి పైకి రావాలని..పవన్ కళ్యాణ్ అంతస్థాయికి ఎదగాలని కోరుకున్నాడు. అయితే టాలీవుడ్ లో ఎంతమంది హీరోలు ఇలా ఓపెన్ మైండ్ తో వుంటారానేది మీరు ఆలోచించాలి. అందుకే ప్రభాస్ టాలీవుడ్ డార్లింగ్ అయ్యాడు..మరోసారి తాను 'బాహుబలి' అనిపించుకున్నాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



