అల్లు అర్జున్ బాటలో ప్రభాస్.. పుష్ప-2 రికార్డు బ్రేక్ అవుతుందా..?
on Jun 3, 2025

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా మారుతి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న చిత్రం 'ది రాజా సాబ్' (The Raja Saab). ఈ ఏడాది సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ సినిమా పలు కారణాల వల్ల వాయిదా పడింది. తాజాగా మేకర్స్ కొత్త విడుదల తేదీని ప్రకటించారు.
'రాజా సాబ్' సినిమాని డిసెంబర్ 5న విడుదల చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. మూవీ రిలీజ్ డేట్ తో పాటు టీజర్ అప్డేట్ కూడా ఇచ్చారు. జూన్ 16న ఉదయం 10.52 నిమిషాలకు టీజర్ విడుదల చేయబోతున్నట్లు తెలిపారు. ఈ అనౌన్స్ మెంట్ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ లో ప్రభాస్ డబ్బులతో నిండి ఉన్న గదిలో ఫెరోషియస్ గా కనిపించడం ఆసక్తి కలిగిస్తోంది.
ప్రభాస్ ఇప్పటిదాకా చేయని రొమాంటిక్ హారర్ జానర్ లో 'రాజా సాబ్'ను దర్శకుడు మారుతి రూపొందిస్తుండటంతో ఈ సినిమా మీద అందరిలో ఆసక్తి నెలకొంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ తదితరులు నటిస్తున్నారు.
గతేడాది డిసెంబర్ 5న అల్లు అర్జున్ నటించిన 'పుష్ప-2' విడుదలై ఎంతటి సంచలన విజయం సాధించిందో తెలిసిందే. ఈ ఏడాది అదే డేట్ కి 'రాజా సాబ్' రానుండటం ఆసక్తికరంగా మారింది. మరి పుష్ప-2 బాటలోనే రాజాసాబ్ కూడా సంచలనాలు సృష్టిస్తుందేమో చూడాలి.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



