జపాన్ లోనూ 'సాహో'
on Apr 4, 2019
ఒక్క సినిమా... ఒకే ఒక్క సినిమా... అనుకున్నది కాస్తా రెండు సినిమాలయ్యాయి. 'బాహుబలి'గా మొదలైన రాజమౌళి స్వప్నం... రెండు భాగాలుగా 'బాహుబలి ది బిగినింగ్', 'బాహుబలి ది కంక్లూజన్' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ ఫ్రాంచైజీలో లో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేశాడు. రెండు చిత్రాలు.. రెండు పాత్రలు... ప్రభాస్ జీవితాన్ని మార్చేశాయి. దేశవ్యాప్తంగా, ఆ మాటకొస్తే ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ తెచ్చాయి. ఎంత పాపులారిటీ అంటే... సాహో సినిమా జపాన్ థియేట్రికల్ రైట్స్ భారీ మొత్తానికి అమ్ముడయ్యేంత. జపాన్ లో బాహుబలి 2 భాగాలు భారీ విజయాన్ని సాధించాయి. దాంతో బాహుబలి తర్వాత ప్రభాస్ నటిస్తున్న సాహో చిత్రానికి అక్కడ డిమాండ్ ఏర్పడింది. పలువురు డిస్ట్రిబ్యూటర్లు సినిమాను విడుదల చేయడానికి ముందుకు వచ్చారు. వారిలో ఒకరికి భారీ మొత్తానికి థియేట్రికల్ రైట్స్ ను యు.వి క్రియేషన్స్ విక్రయించిందట. జపాన్‌లోనూ సినిమా విడుదల కానుందని తెలుస్తోంది. 'రన్ రాజా రన్' ఫేం సుజిత్ దర్శకత్వంలో లో రూపొందుతున్న ఈ సినిమా ఆగస్టు 15న విడుదల కానున్న సంగతి తెలిసిందే.