The Raja Saab: దేవరకి, రాజా సాబ్ కి తేడా ఇదే.. తప్పు ఫ్యాన్స్ దేనా?
on Jan 12, 2026

నెగెటివ్ టాక్ తో హిట్ కొట్టిన దేవర
సినిమాని నిలబెట్టిన ఎన్టీఆర్ ఫ్యాన్స్
రాజా సాబ్ విషయంలో సీన్ రివర్స్
ప్రభాస్ ఫ్యాన్సే సినిమాకి నష్టం కలిగించారా?
కేవలం అభిమానులు చూస్తేనే సినిమాలు ఆడవు. సాధారణ ప్రేక్షకుల ఆదరణ కూడా పొందితేనే సినిమాలు హిట్ అవుతాయి. అవును నిజమే. ఫ్యాన్స్ చూసినంత మాత్రాన సినిమాలు హిట్ కావు. కానీ, ఒక యావరేజ్ సినిమాని మొదటి రెండు-మూడు రోజులు నిలబెట్టి.. దానిని జనరల్ ఆడియన్స్ లోకి బలంగా తీసుకెళ్లగలిగే శక్తి ఫ్యాన్స్ కి ఉంటుంది. అప్పుడు 'దేవర' విషయంలో అదే మ్యాజిక్ జరిగింది. ఇప్పుడు 'ది రాజా సాబ్' విషయంలో అదే లోపించింది.
'ఆర్ఆర్ఆర్' తర్వాత జూనియర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన మూవీ 'దేవర'(Devara). అయితే 'ఆచార్య' తర్వాత కొరటాల శివ డైరెక్ట్ చేసిన సినిమా కావడంతో.. 'దేవర'పై విడుదలకు ముందు పెద్దగా హోప్స్ లేవు. అందుకు తగ్గట్టుగానే మొదటి షో నుంచే నెగెటివ్ టాక్ వచ్చింది. రివ్యూలు కూడా గొప్పగా రాలేదు. సోషల్ మీడియాలోనూ విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి. అయినప్పటికీ 'దేవర' సినిమాని ఎన్టీఆర్ ఫ్యాన్స్ వదిలిపెట్టలేదు. నెగటివిటీకి ఎదురొడ్డి.. పాజిటివ్ టాక్ స్ప్రెడ్ చేస్తూ.. ఫస్ట్ వీకెండ్ సినిమాని నిలబెట్టారు. ఆ తర్వాత అన్ని ఏరియాల్లో సాధారణ ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభించింది. దాంతో 'దేవర' సినిమా బయ్యర్లకు లాభాలను తెచ్చిపెట్టి, ఘన విజయం సాధించింది.
అయితే 'దేవర' విషయంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేసింది, 'ది రాజా సాబ్'(The Raja Saab) విషయంలో ప్రభాస్(Prabhas) ఫ్యాన్స్ చేయలేకపోయారు. పాన్ ఇండియా స్టార్ అయినటువంటి ప్రభాస్.. మీడియం రేంజ్ డైరెక్టర్ మారుతితో సినిమా చేస్తున్నాడని తెలిసినప్పటి నుంచే ఫ్యాన్స్ ఈ ప్రాజెక్ట్ పై పాజిటివ్ గా లేరు. అయితే రిలీజ్ ట్రైలర్ తో సినిమాపై హోప్ వచ్చింది. కానీ, తీరా సినిమా విడుదలయ్యాక డివైడ్ టాక్ వచ్చింది. నిజానికి యాంటీ ఫ్యాన్స్ నెగెటివ్ టాక్ స్ప్రెడ్ చేస్తే.. దానికి ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తుంటారు. కానీ 'రాజా సాబ్'కి కొందరు ప్రభాస్ ఫ్యాన్సే ఎక్కువ నష్టం కలిగించారు. మొదటి షో నుంచే సినిమా బాలేదు, మారుతి అడ్రెస్ ఎక్కడ? అని ఫైర్ అవుతూ కామెంట్స్ పెట్టారు. దీంతో జనరల్ ఆడియన్స్ లోకి బాగా నెగెటివ్ టాక్ వెళ్ళిపోయింది. అభిమానులే ఇలా అంటున్నారు అంటే.. సినిమా ఎంత దారుణంగా ఉందో అనే అభిప్రాయానికి వచ్చేశారు.
Also Read: మన శంకర వరప్రసాద్ గారు మూవీ రివ్యూ
నిజానికి 'రాజా సాబ్' అంత తీసిపడేసే సినిమా కాదు. చెప్పాలనుకున్న పాయింట్ బాగానే ఉంది కానీ, ఎగ్జిక్యూషన్ లో తడబడ్డాడు మారుతి. అలాగే మూవీ టీం చేసిన ఒక పెద్ద తప్పు కూడా ఉంది. ట్రైలర్ లో ఎంతో హైప్ ఇచ్చిన ప్రభాస్ ఓల్డ్ గెటప్ ని సినిమాలో ట్రిమ్ చేశారు. అది సినిమా టాక్ కి బాగా మైనస్ అయింది. ఆ విషయాన్ని గ్రహించి తర్వాత ఆ ఓల్డ్ గెటప్ సీన్స్ యాడ్ చేసినప్పటికీ.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
'రాజా సాబ్'లో కొన్ని సీన్స్ ట్రిమ్ చేసి, ఓల్డ్ గెటప్ సీన్స్ యాడ్ చేశాక అవుట్ పుట్ ఇప్పుడు మెరుగ్గానే ఉంది. కానీ ఇప్పుడు ఈ విషయం ప్రేక్షకులకు చేరువ కావట్లేదు. అందుకే మొదటి రెండు రోజులు ప్రభాస్ ఫ్యాన్స్ 'రాజా సాబ్'ని నిలబెట్టే ప్రయత్నం చేసినట్లయితే.. ఇప్పుడు జనరల్ ఆడియన్స్ ఈ సినిమా చూడటానికి ఆసక్తి చూపేవారు. అదే జరిగితే ప్రభాస్ స్థాయికి తగ్గట్టుగా భారీ వసూళ్లు వచ్చేవి.
ఏది ఏమైనా మొదటి రోజు 'రాజా సాబ్' చూసిన ఫ్రస్ట్రేషన్ లో నెగెటివ్ కామెంట్స్ చేసిన కొందరు ప్రభాస్ ఫ్యాన్స్.. తమకు తెలియకుండానే తమ హీరో సినిమాకి నష్టం కలిగించారని చెప్పవచ్చు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



