స్టేడియం సిద్ధం చేస్తున్న రెహమాన్... ఫ్యాన్స్ రెడీయా?
on Mar 27, 2023
రెహమాన్ ఇప్పుడు స్టేడియం సిద్ధం చేసే పనుల్లో ఉన్నారు? ఒకరా? ఇద్దరా? అన్ని భాషల నుంచి వచ్చే అభిమానులను ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంచడానికి అన్నీ ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిక రెహమాన్‌కి సాయం చేస్తున్నారు మణిరత్నం అండ్ లైకా ప్రొడక్షన్స్. మణిరత్నం మాగ్నమ్ ఆపస్ మూవీ పొన్నియిన్ సెల్వన్ 1 కి సీక్వెల్ గా పొన్నియిన్ సెల్వన్ 2 సిద్ధమవుతోంది. ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సీక్వెల్‌గా పీయస్2 రికార్డు క్రియేట్ చేసింది. అత్యంత భారీ స్థాయిలో ఈ వేసవికి పొన్నియిన్ సెల్వన్ 2 ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి రెడీ అవుతున్నారు మేకర్స్. ఫస్ట్ పార్ట్ 500 కోట్లు వసూలు చేస్తే, సెకండ్ పార్ట్ ని సేమ్ అమౌంట్ పెట్టి తెరకెక్కించారు మణిరత్నం. ఈ సినిమాలో నటించిన హీరోలు ఆయా పాత్రలకు ట్రాన్స్‌ఫర్మేషన్ అయిన తీరును రీసెంట్‌గా వీడియోల ద్వారా తెలుపుతున్నారు మేకర్స్.
అగనగ పాటకు రీల్స్ చేసి పంపిన వారికి ప్రైజ్‌లు ఇస్తామని కూడా ఊరించారు త్రిష కృష్ణన్. సినిమాలో ఉన్న క్రూ అంతా తమ వంతుగా ప్రమోషన్లు చేస్తుంటే, ఇది నా టైమ్ అంటూ ముందుకు వచ్చారు ఎ.ఆర్.రెహమాన్. పీయస్2 పాటలను ఈ నెల 29న విడుదల చేయనున్నారు. చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో ఈ వేడుక అత్యంత వైభవంగా జరగనుంది. ఈ విషయాన్ని ఎ.ఆర్.రెహమాన్ ఇవాళ ట్విట్టర్‌లో పంచుకున్నారు.
విక్రమ్, ఐశ్వర్యరాయ్, త్రిష, జయం రవి, కార్తి, జయరామ్, శోభిత, ప్రకాష్‌రాజ్, పార్తిబన్, లక్ష్మీమీనన్ కీలక పాత్రల్లో నటించిన సినిమా ఇది. పొన్నియిన్ సెల్వన్ విడుదలయ్యే రోజున తెలుగులో అఖిల్ సినిమా ఏజెంట్ ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఇంకా ఏజెంట్ ప్రమోషన్లు పూర్తిస్థాయిలో ప్రారంభం కాలేదన్నది అక్కినేని అభిమానుల మనసులో ఉన్న మాట.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
