వినాయకచవితికి పెద్ది భారీ గిఫ్ట్!.. ఫ్యాన్స్ కి పూనకాలు
on Jul 28, 2025

గ్లోబల్ స్టార్ 'రామ్ చరణ్'(Ram Charan)తన అప్ కమింగ్ మూవీ 'పెద్ది'(Peddi)తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. స్పోర్ట్స్ అండ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీలో 'చరణ్' సరసన 'దేవర'(Devara)భామ జాన్వీ కపూర్(Janhvi Kapoor)హీరోయిన్ గా చేస్తుంది. 'పుష్ప 2'(Pushpa 2)తో పాన్ ఇండియా స్థాయిలో నెంబర్ వన్ మేకర్ గా నిలిచిన మైత్రి మూవీస్(Mythri Movie Makers)తో కలిసి వృద్ధి సినిమాస్(Vriddhi Cinimas),సుకుమార్(Sukumar)రైటింగ్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా, ప్రస్తుతం రెగ్యులర్ గా చిత్రీకరణ జరుపుకుంటుంది. తన క్యారక్టర్ కి సంబంధించి కసరత్తులు చేస్తున్న చరణ్ లుక్స్ ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ గా కూడా మారాయి.
ఇక పెద్ది' నుంచి 'వినాయకచవితి'(Vinayakachavithi)కానుకగా ఆగస్టు 25, న ఫస్ట్ సాంగ్ రిలీజ్ కాబోతున్నట్టుగా సినీ సర్కిల్స్ లో ఒక న్యూస్ వినపడుతుంది. చరణ్ ప్రీవియస్ మూవీ 'గేమ్ చేంజర్'(Game Chanjer)కి సంబంధించి ప్రతి అప్ డేట్ లేట్ అవుతు వస్తుంది. ఈ సారి పెద్ది విషయంలో అభిమానులని నిరుత్సాహానికి గురి చెయ్యకూడదని చరణ్ భావిస్తున్నాడని. అందుకే ఎవరు ఊహించని విధంగా, వినాయక చవితికి సాంగ్ రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నాడని అంటున్నారు. మేకర్స్ కూడా ఈ విషయంపై త్వరలోనే అధికార ప్రకటన చేయనున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.
ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న 'ఉప్పెన' మూవీ ఫేమ్ 'బుచ్చిబాబు సానా'(Buchibabu Sana)మెగా అభిమానులకి 'పెద్ది'రూపంలో బ్లాక్ బస్టర్ హిట్ ఇవ్వాలనే పట్టుదలతో ఉన్నాడు. ఇప్పటికే రిలీజైన టీజర్, చరణ్ లుక్ తో ఈ విషయం అర్ధమవుతుంది. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేన్దు శర్మ కీలక పాత్రల్లో చేస్తున్నారు. ఏఆర్ రెహమాన్(Ar Rehman)సంగీతాన్ని అందిస్తుండగా, చరణ్ క్రికెట్ తో పాటు పలు క్రీడల్లో ప్రావిణ్యం ఉన్న ఆటగాడిగా కనిపిస్తున్న విషయం తెలిసిందే. చరణ్ బర్త్ డే సందర్భంగా వచ్చే ఏడాది మార్చి 27 న విడుదల కానుంది.
.webp)
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



