పెద్ది సినిమాతో 400 కోట్లు.. రామ్ చరణ్ ఊరమాస్ బ్యాటింగ్!
on Sep 11, 2025

ఈ ఏడాది 'గేమ్ ఛేంజర్'తో నిరాశపరిచిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.. వచ్చే ఏడాది 'పెద్ది'తో బాక్సాఫీస్ ని షేక్ చేయాలని చూస్తున్నాడు. 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో వృద్ధి సినిమాస్ నిర్మిస్తున్న ఈ స్పోర్ట్స్ డ్రామాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా గ్లింప్స్ లోని క్రికెట్ షాట్ నేషనల్ వైడ్ గా ట్రెండ్ అయింది. కేవలం ఒక్క గ్లింప్స్ తోనే అందరి దృష్టిని ఆకర్షించిన పెద్ది మూవీ.. అప్పుడే బిజినెస్ పరంగా సంచలనాలు సృష్టిస్తోంది. (Ram Charan)
'పెద్ది' సినిమా బడ్జెట్ దాదాపు రూ.300 కోట్లని తెలుస్తోంది. అంత బడ్జెట్ అయినప్పటికీ నిర్మాతల్లో కొంచెం కూడా టెన్షన్ లేదట. దానికి కారణం ఈ మూవీ ఏకంగా రూ.400 కోట్ల బిజినెస్ చేసే అవకాశం కనిపిస్తోంది. పెద్ది డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ ఫ్లిక్స్ రూ.105 కోట్లకు దక్కించుకుందట. ఆడియో రైట్స్ ని రూ.35 కోట్లకు టీ-సిరీస్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. శాటిలైట్ రైట్స్ ద్వారా మరో రూ.40 కోట్ల వచ్చే అవకాశముంది. అంటే నాన్-థియేట్రికల్ రైట్స్ ద్వారానే ఏకంగా రూ.180 కోట్లు రికవర్ కానుంది. (Peddi Movie)
ఇక థియేట్రికల్ బిజినెస్ విషయానికొస్తే.. రూ.220 కోట్ల నుంచి రూ.250 కోట్ల దాకా జరిగే ఛాన్స్ ఉంది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే రూ.120 కోట్లకు పైగా బిజినెస్ జరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ కలిపి మరో రూ.100 కోట్లకు పైగా బిజినెస్ ఈజీగా జరుగుతుంది. అంటే 'పెద్ది' థియేట్రికల్ బిజినెస్.. రూ.220 కోట్లకు అసలు తగ్గదు అన్నమాట. టీజర్, ట్రైలర్ విడుదల తర్వాత.. సినిమాపై మరింత హైప్ వచ్చి.. థియేట్రికల్ బిజినెస్ రూ.250 కోట్ల మార్క్ ని టచ్ చేసినా ఆశ్చర్యంలేదు.
ప్రస్తుత ట్రెండ్ ని బట్టి చూస్తే.. పెద్ది సినిమాకి థియేట్రికల్, నాన్-థియేట్రికల్ రైట్స్ రూపంలో కనీసం రూ.400 కోట్లు రావడం ఫిక్స్. ఈ లెక్కన పెద్ది నిర్మాతలు సేఫ్ జోన్ లో ఉన్నారని చెప్పవచ్చు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



