ENGLISH | TELUGU  

ఏం చెప్పావయ్యా పవన్ కళ్యాణ్..మీసాలు మెలేసారుగా  

on Mar 14, 2025

తెలుగు సినిమా అగ్ర హీరోల్లో ఒకరు, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం శాసనసభ్యులు కొణిదెల పవన్ కళ్యాణ్(Pawan Kalyan)2014 మార్చి 14 న జనసేన(Janasena) పార్టీని ప్రారంభించిన విషయం తెలిసిందే. తెలంగాణ(Telangana)రాష్ట్ర రాజధాని హైదరాబాద్(Hyderabad)లో పుట్టిన ఈ పార్టీ నిన్న తన 12 వ ఆవిర్భావదినోత్సవ వేడుకల్ని ఆంధ్రప్రదేశ్ లోని పిఠాపురం సమీపాన జరుపుకుంది.

ఈ సందర్భంగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సభకి హాజరైన పార్టీ జనసేన కార్యకర్తల్ని,వీరమహిళలని, ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడుతు మనం 2019 ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు  మీసాలు మెలేశారు,జబ్బలు చరిచారు.ప్రయాణంలో ఆటంకాలు వచ్చినా వెనకడుగు వేయలేదు.అన్నీ ఒక్కడినై పోరాటం చేశా.ఓడినా అడుగు ముందుకే వేసి రుద్రవీణ వాయిస్తా,అగ్నిధారలు కురిపిస్తా అనే మాటలు నిజం చేశాం.మనం నిలబడటంతో పాటు పార్టీని నిలబెట్టాం.నాలుగు దశాబ్దాల టీడీపీని కూడా నిలబెట్టాం. మన కార్యకర్తలను, వీరమహిళలను అనేక బాధలు పెట్టారు.

నన్నుఅణచివేసేందుకు అనేక కుట్రలు చేశారు.అసెంబ్లీ గేటును తాకనివ్వం అని ఛాలెంజ్ చేశారు.వాళ్ల ఛాలెంజ్‌లు సవాలుగా తీసుకుని పోరాడి,.వైసిపీ దాష్టీక ప్రభుత్వాన్ని దించి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకోవడమే కాకుండా దేశమంతా మనవైపు చూసేలా వందశాతం స్ట్రైక్‌రేట్‌తో విజయం సాధించాం. మన పార్టీకి 11వ సంవత్సరం.వాళ్లను 11 సీట్లకు పరిమితం చేసాం. జనసేన జన్మస్థలం తెలంగాణ. కర్మస్థానం ఆంధ్రప్రదేశ్‌.నా తెలంగాణ కోటి రతనాల వీణ,కరెంట్‌షాక్‌ కొట్టి చావుబతుకుల్లో ఉంటే తెలంగాణలోని కొండగట్టు అంజన్న ప్రాణం పోశాడు.గజ్జెకట్టి ప్రజలను ప్రభావితం చేసిన గద్దర్‌ అన్నకు నివాళులు.ఖుషి సినిమా చూసి గద్దర్‌(Gaddar)నన్ను ప్రోత్సహించారు.మా జనసేన వీరమహిళలు,రాణిరుద్రమలు.తేడా వస్తే కాల్చి ఖతం చేసే లేజర్ బీమ్‌లు.తమిళనాడు,మహారాష్ట్ర,కర్ణాటకలోను రాజకీయపరంగా మన పార్టీకి అభిమానులున్నారు.
తమిళులు నా తెలుగు ప్రసంగాలు వింటున్నారని తెలిసింది.వారు నాపై చూపుతున్న ప్రేమకి కృతజ్ఞుడిని.మనదేశానికి బహుభాషలే మంచిది.తమిళనాడు సహా అన్ని రాష్ట్రాలకు ఒకే సిద్ధాంతం ఉండాలి. 
సెంట్రల్ వర్సిటీ ప్రొఫెసర్‌ శ్రీపతి రాముడు నన్ను ఎంతో ప్రభావితం చేశారు.పోలీసులకు స్వయం నిర్ణయాధికారం ఉండదు.విధుల నిర్వహణే ఉంటుంది.సగటు మధ్యతరగతి మనిషిగా బతకడమే నా కోరిక.నేను డిగ్రీ చేసి ఎస్‌ఐను కావాలని మా నాన్న అనేవారు.చంటి సినిమాలో మీనాను పెంచినట్లు మా ఇంట్లో నన్ను పెంచారు.బయటకు వెళ్తే ఏమవుతానో అని మా ఇంట్లో నిత్యం భయపడేవారు.సినిమాల్లోకి, రాజకీయాల్లోకి వస్తానని నేనెప్పుడూ అనుకోలేదు.మా నాన్న చిన్నప్పుడు ఎంతో క్రమశిక్షణతో పెంచారు.కోట్లమందికి సేవ చేసేందుకు అవకాశం ఇచ్చింది ఆ భగవంతుడే. నేను రాజకీయాల్లోకి వచ్చేందుకు సినిమా ఉపకరణం మాత్రమే అని చెప్పుకొచ్చారు. హిందీ,తమిళం,మరాఠీ,కన్నడ,ఆంగ్ల భాషల్లో కూడా పవన్ ప్రసంగం సాగింది.

 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.