చిన్నారి కోరికను తీర్చబోతున్న పవన్
on Oct 16, 2014
.jpg)
ఖమ్మం జిల్లాకు చెందిన 12సంవత్సరాల శ్రీజ అనే బాలిక ప్రాణాంతక వ్యాధితో బాధపడుతోంది. తన చివరి కోరికగా పవన్ కళ్యాణ్ ను చూడాలని ఆరాటపడుతున్నది. తన కూతురి కోరికను తెలుసుకున్న తల్లిదండ్రులు బంధువుల సలహా మేరకు మేక్ ఎ విష్ ఫౌండేషన్ ప్రతినిధులను కలిశారు. మేక్ ఎ విష్ ఫౌండేషన్ సంస్థ సాధిక్ అనే తీవ్ర వ్యాధిగ్రస్త బాలుడి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అవ్వాలన్న కోరికను బుధవారం నాడు తీర్చింది. ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్‌ని కలవాలని అనుకుంటున్న బాలిక గురించి మీడియా వద్ద ప్రస్తావించారు.ఆ విషయాన్ని తెలుసుకున్న పవన్ కళ్యాణ్ శ్రీజని కలవటానికి అంగీకరించారట. ఈ రోజు లేదా రేపు ఖమ్మంలో పవన్ ఆమెను కలుస్తారట.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



