'అఖండ-2' సక్సెస్ మీట్ కి పవన్ కళ్యాణ్!
on Dec 17, 2025

అమరావతిలో 'అఖండ-2' సక్సెస్ మీట్
ముఖ్య అతిథులుగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్!
డిప్యూటీ సీఎం ఏం మాట్లాడనున్నారు?
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందిన 'అఖండ 2: తాండవం' విజయవంతంగా థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. బాలకృష్ణ-బోయపాటి కాంబోకి మరో విజయాన్ని అందించడమే కాకుండా.. బాలయ్య కెరీర్ లో వరుసగా ఐదవ రూ.100 కోట్ల గ్రాస్ సినిమాగా నిలిచింది. (Akhanda 2: Thaandavam)
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో 'అఖండ-2' సక్సెస్ మీట్ ని నిర్వహించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. డిసెంబర్ 18 లేదా 19న ఈవెంట్ జరపడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ వేడుకకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారని వినికిడి.
సనాతన ధర్మం గొప్పతనాన్ని వివరించేలా 'అఖండ-2'లో సన్నివేశాలు ఉన్న విషయం తెలిసిందే. దీంతో నిజ జీవితంలో సనాతన ధర్మం నినాదాన్ని వినిపిస్తున్న పవన్ కళ్యాణ్.. ఈ మూవీ సక్సెస్ మీట్ లో ఏం మాట్లాడతారు అనేది ఆసక్తికరంగా మారింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



