'ఉస్తాద్ భగత్ సింగ్'.. మనల్ని ఎవడ్రా ఆపేది
on Dec 10, 2022

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో గతంలో 'భవదీయుడు భగత్ సింగ్' చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వీరి కాంబోలో రాబోతున్న చిత్రానికి టైటిల్ మారింది. భవదీయుడు స్థానంలో ఉస్తాద్ ని పెట్టి 'ఉస్తాద్ భగత్ సింగ్' అనే కొత్త టైటిల్ అనౌన్స్ చేశారు.
మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం తమిళ్ మూవీ 'తేరి'కి రీమేక్ అనే టాక్ ఉంది. ఆ స్టోరీ లైన్ తీసుకొని హరీష్ తనదైన శైలిలో మార్పులు చేశాడని తెలుస్తోంది. గతంలో పవన్-హరీష్ కలయికలో వచ్చిన 'గబ్బర్ సింగ్' కూడా అంతే. హిందీ ఫిల్మ్ 'దబాంగ్' నుంచి స్టోరీ లైన్ తీసుకొని పవన్ బాడీ ల్యాంగ్వేజ్ కి తగ్గట్లు మార్పులు చేసి ఫ్యాన్స్ ని మెప్పించి బ్లాక్ బస్టర్ కొట్టాడు హరీష్. ఇప్పుడు కూడా అదే మ్యాజిక్ రిపీట్ చేస్తాడేమో చూడాలి.

గతంలో భవదీయుడు భగత్ సింగ్ ప్రకటన సమయంలో ఒక పోస్టర్ ని విడుదల చేసిన మేకర్స్.. ఇప్పుడు 'ఉస్తాద్ భగత్ సింగ్' టైటిల్ తో మరో కొత్త పోస్టర్ ని వదిలారు. ఆ పోస్టర్ లో మాదిరిగానే ఈ పోస్టర్ లో కూడా బైక్ దగ్గర టీ గ్లాస్ పట్టుకొని ఉన్నాడు పవన్. అలాగే పోస్టర్ పై "మనల్ని ఎవడ్రా ఆపేది" రాసుంది. ఇది 'రిపబ్లిక్' సినిమా వేడుకలో పవన్ స్పీచ్ లోని మాట కాగా, అది బాగా ట్రెండ్ అయింది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో నేడు ప్రారంభమవుతోంది. షూటింగ్ త్వరలోనే మొదలు కానుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



