పవన్‌కి ఓ దర్శకుడు కావలెను!
on Nov 4, 2014
.jpg)
అర్జెంటుగా పవన్ కల్యాణ్ కి ఓ దర్శకుడు కావాలి. పవన్‌కి సరిపడా కథతో వస్తే... బ్రహ్మరథం పట్టడానికి నిర్మాతలు, కెమెరా ముందుకు రావడానికి పవన్ కూడా సిద్ధంగా ఉన్నాడు. విషయం ఏంటంటే.... పవన్ కల్యాణ్‌తో పీవీపీ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మించాలని తలపెట్టింది. అందుకే పవన్ గబ్బర్ సింగ్ 2 ప్రాజెక్టును ప్రస్తుతానికి పక్కన పెట్టేశాడు. గోపాల గోపాల తరవాత గబ్బర్ సింగ్ 2 చేయాలి. కానీ పీవీపీ సంస్థ ఓ కోసం తన ఆలోచన మార్చుకొన్నాడు. గోపాల గోపాల - గబ్బర్ సింగ్ 2 గ్యాప్‌లో ఓ సినిమా చేసేద్దామని డిసైడ్ అయ్యాడు. కాకపోతే పవన్ దగ్గర కథలేం లేవు. దర్శకుడూ లేడు. కాబట్టి.. ఇప్పుడా వేటలో ఉంది పీవీపీ సంస్థ. పవన్ కోసం అర్జెంటుగా ఓ కథ రెడీ చేసి, దర్శకుడిని సెట్ చేసి... వీలైనంత త్వరలో సెట్స్‌పైకి తీసుకెళ్లాలన్న ఆలోచనలో ఉన్నారు. పవర్ దర్శకుడు బాబి కూడా పవన్‌కి ఓ కథ వినిపించాడట. కోన వెంకట్ అండ్ కో.. కూడా పవన్ కోసం మాస్ మసాలా కథ రెడీ చేసే పనిలో పడ్డారు. మరి ఎవరి కథ ఓకే అవుతుందో, ఆ కథకు ఎవరు దర్శకత్వం వహిస్తారో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



