పవన్ సినిమాలో వెంకటేష్ పాత్ర ఏంటో తెలుసా...
on Jun 21, 2017

పవన్ కళ్యాణ్, వెంకటేష్ మంచి మిత్రులు. వాళ్లిద్దరూ గోపాల గోపాల అనే చిత్రంలో కలిసి నటించారు. ఈ ఇద్దరు హీరోల అభిమానులకి మరో తీపి కబురు ఏంటంటే పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలో వెంకటేష్ ఒక చిన్న పాత్ర చేస్తున్నాడు. ఈ పాత్ర నిడివి మూడు నిముషాలు, కానీ వెంకటేష్ కనిపించినంత సేపు థియేటర్లో నవ్వుల జల్లు ఖచ్చితం అంటున్నారు. నిన్న సారధి స్టూడియోలో వెంకటేష్, పవన్ కళ్యాణ్ మధ్య వచ్చే సన్నివేశాలు చిత్రీకరించారు. వాస్తవానికి, త్రివిక్రమ్ శ్రీనివాస్ మొదట ఈ రోల్ ఎవరైనా క్యారెక్టర్ ఆర్టిస్ట్ తో చేయిద్దామనుకున్నాడట. కానీ, పవన్ కళ్యాణ్ స్క్రిప్ట్ చదివిన తర్వాత ఆ పాత్రకి తన మిత్రుడైన వెంకటేష్ అయితే బాగుంటుందని చెప్పాడట. ఈ ఐడియా త్రివిక్రమ్ కి తెగ నచ్చడంతో కామెడీ డోస్, పాత్ర పరిధి అనుకున్నదానికంటే కొంచెం పెంచాడట.
త్రివిక్రమ్ కూడా వెంకటేష్ కి మంచి మిత్రుడన్న విషయం మనకి తెలిసిందే. ఇద్దరు మిత్రులు కలిసి అడగడంతో పాటు, తనకి ఆ క్యారెక్టర్ నచ్చడంతో వెంకటేష్ ఒప్పుకున్నాడట. గురు ఘన విజయం తర్వాత ఇంకేం సినిమా ఒప్పుకోని వెంకటేష్, త్వరలో పవన్ కళ్యాణ్ సినిమాలో మెరవనున్నాడు. తన మేనల్లుడు నాగ చైతన్య ప్రేమమ్ లో కూడా వెంకటేష్ ఒక చిన్న పాత్ర చేయగా, దానికి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు పవన్ పక్కన కనపడడం సినీ అభిమానులకి కన్నుల పండుగే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



