ఆ డైరెక్టర్‌కి పర్మిషన్ ఇచ్చిన పవన్ కళ్యాణ్
on Mar 10, 2018

పూర్తిస్థాయి రాజకీయాలతో బిజీ గా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సినిమాలు చేసే విషయంలో ఒక నిర్ణయం తీసుకున్నాడు. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో, మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో ఒక సినిమా చేయాల్సిన పవన్, ఇంతకు ముందు తీసుకున్న అడ్వాన్స్ అమౌంట్ నిర్మాతలకి తిరిగి ఇచ్చేసి, ఇక ఇప్పట్లో సినిమాలు చేయనని... అదే కథతో వేరే హీరో తో చేసుకోవచ్చని పర్మిషన్ ఇచ్చాడట. అజ్ఞాతవాసి రిలీజ్ టైం లో ఒక రెండు నెలలు ఆగమని చెప్పిన పవన్, ప్రస్తుతం తనకు సినిమాలు చేసే ఉద్దేశ్యం కానీ, టైం కానీ లేవని క్లారిటీ ఇచ్చాడట. పవన్ ని డైరెక్ట్ చేద్దామని ఎన్నో కళలు కన్న సంతోష్ శ్రీనివాస్ ఆశలు అడియాశలయ్యాయి. అయితే, ఈ మధ్యలో గోపీచంద్ కి వేరే కథ చెప్పి ఒకే చేయించుకున్న సంతోష్ ఆ మూవీ ని త్వరలో పట్టాలకెక్కించే పనిలో ఉన్నాడట. తొలిప్రేమ తో హిట్ సొంతం చేసుకున్న భోగవల్లి ప్రసాద్ నిర్మాతగా వ్యవహరించనున్నాడు. మరి, పవన్ కళ్యాణ్ కోసం సిద్ధం చేసిన కథను శ్రీనివాస్ పక్కన పెడతాడా లేక వేరే హీరోతో చేస్తాడో తెలియాల్సి ఉంది. కేవలం, పవన్ స్టార్ స్టేటస్ దృష్టిలో పెట్టుకుని కథ రచించిన సంతోష్, మరో హీరో తో ఆ సినిమా చేసే ధైర్యం చేస్తాడో లేదో చూడాలి!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



