'కోబలి' మొదలైంది
on Apr 13, 2015
.jpg)
అత్తారింటికి దారేది తరవాత పవన్ కల్యాణ్, త్రివిక్రమ్‌లు మళ్లీ ఎప్పుడు కలుస్తారు? వీరిద్దరి కలయికలో మరో సినిమాఎప్పుడు?? పవన్ అభిమానులు ఈ సమాధానాల కోసమే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వీరిద్దరూకలసి 'కోబలి' సినిమా ఒకటి చేస్తారని అప్పట్లో వార్తలొచ్చాయి. ఈ సినిమాకి ఇంకొంచెం టైమ్ పడుతుందని త్రివిక్రమ్ కూడా చెబుతున్నారు. అయితే కోబలికి సంబంధించిన స్ర్కిప్టు పనులు మొదలైపోయాయట. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఓ పక్క మెల్లిగా జరుగుతున్నాయని సమాచారం. రాయలసీమ ప్రాంతానికి చెందిన కథ ఇది. అందుకోసం త్రివిక్రమ్ రీసెర్చ్ వర్క్ కూడా మొదలెట్టినట్టు తెలుస్తోంది. ఇది ఓ ప్రయోగాత్మక చిత్రం అనుకొంటున్నా.. పూర్తి వాణిజ్య విలువలతో తెరకెక్కిస్తున్నారట. మహేష్ బాబు - త్రివిక్రమ్‌ల సినిమాపూర్తయ్యాక కోబలి సినిమాసెట్స్‌పైకి వెళ్లే చాన్సుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



