రాజకీయ నాయకులపై పవన్ కామెంట్స్
on Mar 2, 2014
హృదయ స్పందన ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన 5కె హార్ట్ వాక్ని పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ ప్రారంభించారు. ఇందులో భాగంగా పవన్ రాజకీయ నాయకులపై సెటైర్ వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వైద్యానికి నోచుకోని చిన్నారులను రక్షించడానికి ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు చేస్తున్న సాయం ఎంతో అభినందనీయం. రాష్ట్రాలు రెండుగా విడిపోయాయి. రాష్ట్ర రాజకీయనాయకులు కూడా బిజీగా ఉంటారు. ప్రభుత్వం చేయాల్సిన పనులను స్వచ్ఛంద సంస్థలు చేస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో మావంతు సహాయంగా ఏదైనా చేయాలని ముందుకొచ్చిన ఈ సంస్థలకు ప్రత్యేక అభినందనలు అని అన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు త్రివిక్రమ్ కూడా పాల్గొన్నారు.