గబ్బర్ సింగ్ 2 డైరెక్టర్ మారాడోచ్!
on Oct 29, 2014

పవన్ కల్యాణ్ అభిమానులు ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం గబ్బర్ సింగ్ 2. రచ్చ తరవాత సంపత్‌నంది సైన్ చేసిన సినిమా ఇదే. పవన్ కల్యాణ్ పిలిచి మరీ ఛాన్స్ ఇచ్చాడని చెప్పుకొన్నారు. ఇప్పడు సంపత్‌నంది స్థానంలో మరో దర్శకుడొచ్చాడు. తనే... బాబి. బలుపుకి రచయితగా పనిచేసిన బాబి, ఆ తరవాత పవర్‌కి మెగా ఫోన్ పట్టాడు. ఇప్పుడు మెగా హీరోతో సినిమా చేసే ఛాన్స్ అందుకొన్నాడన్నమాట. నిర్మాత శరత్‌మరార్‌కి బాబి పనితనం బాగా నచ్చిందట. పవర్ సినిమా చూసి శరత్ మరార్ ఫుల్ ఖుషీ అయ్యారట. ఆయనే పవన్‌కు బాబీ పేరు సూచించారని టాక్. ఇటీవల పవన్ కల్యాణ్ పవర్ సినిమా చూశారని, దాంతో బాబీ పేరు కన్‌ఫామ్ అయిపోయిందని చెప్పుకొంటున్నారు. డిసెంబరులో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



