సర్దార్‌లో 'కాపు' భజన
on Feb 9, 2016
.jpg)
ఆంధ్రప్రదేశ్‌లో `కాపు` ఫీలింగ్ బలంగాప్రబలుతోంది. ముద్రగడ దీక్షతో... కాపులంతా ఏకమయ్యారు. తమ హక్కుల కోసం చేయీ చేయీ కలిపి ఓ ఉద్యమాన్ని లేవదీశారు. ఈ దశలో పవన్ కల్యాణ్ కాపులపై చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. `నాకు కావాల్సింది కాపు ఓట్లు కాదు. నేను కాపులకు మాత్రమే నాయకుడ్ని కాదు` అంటూ కాపులల్లో కలవరం సృష్టించాడు. కొన్ని చోట్ల కాపులు పవన్ కి వ్యతిరేకంగా ధర్నాలు చేశారు. పవన్ ఫ్లెక్సీలను కూడా చింపేశారు. దిష్టి బొమ్మల్ని దగ్థం చేశారు.
ఇప్పుడు వాళ్లందరినీ మళ్లీ కూల్ చేసేందుకు పవన్ మళ్లీ నడుం బిగించాడట. తన తాజా చిత్రం సర్దార్ - గబ్బర్ సింగ్‌లో కాపులను ఉద్దేశించి కొన్ని సంభాషణలు పలికినట్టు టాక్. ''నేను కాపువాడ్ని.. కాపు కాసేవాడ్ని...'' అంటూ పవన్ పలికే సంభాషణలు సినిమా మొత్తానికి హైలెట్ గా నిలుస్తాయని తెలుస్తోంది. `నేను మీవాడినే` అంటూ కాపులను ఉద్దేశించి పవన్ కొన్ని డైలాగులు పలికాడట. ఓ సన్నివేశం మొత్తం `కాపు`ల ప్రస్తావన ఉంటుందని.. డైరెక్ట్‌గా కాకపోయినా ఇండైరెక్ట్‌గా ఈ డైలాగులన్నీ వాళ్ల హృదయాలకు టచ్ అవుతుందని చెప్పుకొంటున్నారు. మరి ఈ డైలాగులతో కాపులు శాంతిస్తారో లేదో తెలియాలంటే సినిమా వచ్చేంత వరకూ ఆగాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



