వీడియో: మీ కోసం తమన్నా అందాల విందు
on Jul 17, 2015
.jpg)
బాహుబలి ఆడియో మొత్తంలో సూపర్ హిట్ గా నిలిచిన పాట 'పచ్చబొట్టేసిన' సాంగ్. బాహుబలి సాంగ్స్ రిలీజైన తరువాత ఈ పాటని యూట్యూబ్ లో రోజుకి లక్ష మంది విన్నారంటే ఎంత పెద్ద హిట్టో వర్ణించనక్కర్లేదు. సినిమా రిలీజ్ తరువాత ఈ పాటకి ఇంకా క్రేజ్ పెరిగిందని చెప్పాలి. ఏ రేడియో ఛానెల్ పెట్టిన, ఎవరి ఫోన్ లో రింగ్ టోన్ చూసిన ఈ పాటనే వినిపిస్తోంది. అలాంటి సక్సెస్ ఫుల్ పాటని..సినిమా విజయవంతంగా నడుస్తున్న తరుణంలో ఫుల్ వీడియో సాంగ్ ని యూట్యూబ్ లో పెట్టి అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది బాహుబలి టీమ్. ఇనుము వేడిగా వున్నప్పుడే వంచాలనే సూత్రాన్ని బాహుబలి పాటిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ పాటపై గీత రచయిత అనంత శ్రీరామ్ మాట్లాడుతూ.. 650 పాటలు రాశానని.. అందులో ఇప్పుడు బాహుబలిలో పచ్చబొట్టేసి పాట రాసే అవకాశం అదృష్టాన్ని కలిగించాయన్నాడు. పచ్చబొట్టేసి.. పాటను రోజుకు లక్ష మంది యూట్యూబ్లో వింటున్నారంటే ఎంత పెద్ద హిట్టో వర్ణించనక్కర్లేదంటున్నాడు అనంత శ్రీరామ్. అయితే ఈ పాటను రాయడం వెనుక 70రోజుల మథనం ఉందని అంటున్నాడు రచయిత. తన కెరీర్లో పంచదార బొమ్మా బొమ్మా (మగధీర) తర్వాత మళ్లీ అంత హిట్టయిన పాట ఇదని చెప్పుకొచ్చాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



