పవన్ కళ్యాణ్ ని చూసి మిగతా హీరోలు నేర్చుకోవాలి!
on Sep 15, 2025

ఈ పాన్ ఇండియా ట్రెండ్ లో స్టార్ హీరోల సినిమాలు ఒక్కోటి పూర్తి కావడానికి రెండు మూడేళ్లు పడుతుంది. దీంతో అభిమానులు నిరాశచెందుతున్నారు. థియేటర్లు కూడా చాలా కాలం పాటు వెలవెలబోతున్నాయి. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ని చూసి, మిగతా స్టార్స్ నేర్చుకోవాలనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. (Pawan Kalyan)
పవన్ కళ్యాణ్ తప్ప దాదాపు మిగతా స్టార్స్ అందరికీ సినిమా తప్ప వేరే లోకం లేదు. అయినప్పటికీ వారి నుంచి ఏడాదికి ఒక్క సినిమా కూడా రావట్లేదు. కానీ, పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ తో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ.. వరుస సినిమాలతో అలరిస్తున్నారు.
ఏపీ డిప్యూటీ సీఎం కాకముందు.. 2021లో 'వకీల్ సాబ్', 2022లో 'భీమ్లా నాయక్', 2023లో 'బ్రో'.. ఇలా ఏడాదికి ఒక్క సినిమా పవన్ కళ్యాణ్ నుంచి వచ్చింది. 2024లో పవన్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. దీంతో ఇక ఆయన చేతిలో ఉన్న సినిమాలు కూడా పూర్తి కావడం కష్టమనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
.webp)
'హరి హర వీరమల్లు' ఆగిపోయింది అన్నారు, 'ఓజీ' ఆలస్యమన్నారు, 'ఉస్తాద్ భగత్ సింగ్' అసలు ఉండకపోవచ్చు అన్నారు. కట్ చేస్తే.. కేవలం కొద్ది నెలల గ్యాప్ లోనే.. ఈ మూడు సినిమాల పెండింగ్ షూట్ ని పూర్తి చేసేశారు పవన్ కళ్యాణ్. మొదట 'హరి హర వీరమల్లు' షూటింగ్ కంప్లీట్ చేశారు. అది జూలై 24న విడుదలైంది. అదే స్పీడ్ లో 'ఓజీ' షూటింగ్ కూడా పూర్తి చేశారు. ఆ సినిమా ఈ సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఇక తాజాగా ఆయన.. 'ఉస్తాద్ భగత్ సింగ్' షూట్ కూడా కంప్లీట్ చేసి సర్ ప్రైజ్ చేశారు. ఈ మూవీ డిసెంబర్ లేదా జనవరిలో విడుదలయ్యే అవకాశముంది.
పవన్ కళ్యాణ్ పొలిటీషియన్ గా, డిప్యూటీ సీఎంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. షూట్ బ్యాలెన్స్ ఉన్న తన మూడు సినిమాలను వేగంగా పూర్తి చేశారు. అలాంటిది సినిమాలే ప్రపంచంగా బ్రతుకుతున్న స్టార్స్.. కనీసం ఏడాదికి ఒక్క సినిమా అయినా పూర్తి చేస్తే బాగుంటుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



