తమన్నాకు నచ్చలేదు... కాజల్‌కి నచ్చింది!
on Oct 17, 2019

తమ్ముడు అశ్విన్ బాబు హీరోగా ఓంకార్ దర్శకత్వం వహించిన 'రాజుగారి గది 3'లో కథానాయికగా ముందు తమన్నాను తీసుకున్నారు. సినిమా ప్రారంభోత్సవానికి ఆమె విచ్చేశారు కూడా! కానీ, సినిమాలో మాత్రం మిల్కీ బ్యూటీ లేరు. అవికా గోర్ నటించారు. విడుదలకు ఒక్క రోజు ముందువరకూ డేట్స్ అడ్జస్ట్ చేయలేక సినిమా నుండి తమన్నా తప్పుకున్నారని అశ్విన్, ఓంకార్ చెబుతూ వచ్చారు. విడుదలకు ముందు ఓంకార్ అసలు నిజాన్ని బయట పెట్టారు. కథలో, తన పాత్రలో మార్పులు చేయమని చెప్పడంతో తమన్నాను సినిమా నుండి తప్పించామని ఆయన చెప్పారు. జస్ట్ స్టోరీ లైన్ విని తమన్నా కథ ఓకే చేశారు. ఓపెనింగ్ కి వచ్చారు. పూర్తి కథ విన్నాక... కొన్ని మార్పులు చేయమని చెబితే ఓంకార్ అన్నయ్యకు నచ్చలేదు. దాంతో ఏకంగా కథానాయికను మార్చేశారు దర్శకుడు కమ్ నిర్మాత ఓంకార్. తమన్నా తప్పుకున్నాక, ఈ కథతో కాజల్ దగ్గరకు వెళ్లానని ఓంకార్ అన్నాడు. అయితే... అప్పటికి కాజల్ ఇతర సినిమాలు అంగీకరించడంతో నెలలో వారం రోజులు మాత్రమే డేట్స్ అడ్జస్ట్ చేస్తానని చెప్పిందట. ఇక లాభం లేదనుకుని అవికా గోర్ ను తీసుకున్నారు. అయితే... కాజల్, తమన్నాకు చెప్పిన కథ, ఇప్పుడు సినిమా తీసిన కథ వేరని ఓంకార్ అంటున్నాడు. ఆ కథతో తప్పకుండా పెద్ద కథానాయికతో సినిమా తీస్తానని చెబుతున్నాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



