బాలీవుడ్ లెజెండ్ ఓంపురి ఇకలేరు
on Jan 5, 2017
బాలీవుడ్లో ఓ నటశిఖరం నేలకొరిగింది. తన అసమాన నటనతో ఎన్నో విలక్షణ పాత్రలను అద్భుతంగా పోషించి ప్రేక్షకులను అలరించిన ఓంపురి కన్నుమూశారు. ఉదయం గుండెపోటు రావడంతో ముంబైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 66 సంవత్సరాలు. 1950 అక్టోబర్లో ఆయన హర్యాణాలో జన్మించారు. నాటక రంగంలో వేలాది నాటకాలు వేసి నటన పట్ల ఆసక్తితో పుణే ఫిల్మ్ ఇనిస్టిట్యూట్లో చేరి గ్రాడ్యూయేషన్ పూర్తి చేశారు. అనంతరం 1976లో సినీరంగ ప్రవేశం చేశారు. బాలీవుడ్లోనే కాకుండా..మనదేశంలోని దాదాపు అన్ని భాషల్లో నటించారు. అంకురం, రాత్రి తదితర చిత్రాలతో తెలుగువారిని పలకరించారు. భారతీయ సినిమాకు ఆయన చేసిన సేవలకు గానూ భారత ప్రభుత్వం 1990లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. మరో ప్రముఖ నటుడు అమ్రీష్ పురి ఈయన సోదరుడే. ఓంపురి మరణం పట్ల ప్రధాని నరేంద్రమోడీతో పాటు పలువురు బాలీవుడ్ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు..